Telugu News

బూర్గంపాడు మండలం రామాపురం గ్రామంలో రైతు గోస దీక్షలో పాల్గొన్న వైఎస్ షర్మిల

కెసిఆర్ ప్రభుత్వం పై గాటు వ్యాఖ్యలు చేసిన షర్మిల

0

బూర్గంపాడు మండలం రామాపురం గ్రామంలో రైతు గోస దీక్షలో పాల్గొన్న వైఎస్ షర్మిల

?కెసిఆర్ ప్రభుత్వం పై గాటు వ్యాఖ్యలు చేసిన షర్మిల

?కేసీఆర్ నాలుక కి నరం లేదు..నరం లేని నాలుక కేసీఆర్ ది.ఎన్ని అబద్ధాలు అయినా చెప్పగలడు

?రైతుబందు అని చెప్పి మిగతా రైతు సంక్షేమ పథకాలు నిలిపి వేశారు

?రైతు కడుపు న పుట్టడమే శాపం అనే పరిస్థితులు తెలంగాణ లో ఉన్నాయి

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ );-

కులాలకు, మతాలకు అతీతంగా భూమి ఎవరిది అయితే వారికి పట్టాలు ఇవ్వాలి. పాస్ బుక్కులు ఇవ్వాలి..ఇదే న్యాయం.60 ఏళ్లుగా అనుభవిస్తున్న భూమినీ మీరు కాదు అంటే ఎక్కడకు పోతారు. బిడ్డను చుసుకున్నట్లే తమ భూములను చూసుకుంటారు. భూమి తల్లితో సమానం.తమ భూమి కాదు అంటే తల్లిని బిడ్డను వేరు చేసినట్లేఇది ఏ ప్రభుత్వానికి భావ్యం కాదు.. ఏ నాయకుడికి భావ్యం కాదు. ఈ భూమి మాది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని బాద పడుతున్నారు.పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వ భద్యతనేవైఎస్సార్ హయాంలో 3 లక్షల 30 ఎకరాలకు ఎస్టీ లకు పట్టాలు ఇచ్చారు .

also read :-బస్సు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి దుర్మరణం

వైఎస్సార్ హయాంలో 3లక్షల ఎస్సీ లకు పట్టాలు ఇచ్చాడు.8 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఒక్క ఎకరాకు పట్టాలు ఇవ్వలేక పోయారు..?ఎన్నికలప్పుడు పట్టాలు ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు..?నేనే వచ్చి పరిష్కరిస్తా అని ఎందుకు చెప్పారు.?ఎన్నికలప్పుడు హామీలు ఇస్తే సరిపోతుందా..?ఎన్నికల తర్వాత ఎస్టీలను,ఎస్సీలను అసలు మీరు కలిశారా.ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఎండిపోయాయని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

ఇది కేసీఆర్ రాక్షాసతత్వానికి నిదర్శనం.రైతులను అసలు పట్టించుకోవడం మానేశారు.8 ఏళ్లలో ప్రతి ఏడాది వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు.గత 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత 6 నెలల్లో వెయ్యి మంది..రోజుకు కనీసం ఐదారు మంది హత్మహాత్యలు చేసుకున్నారు.అప్పుల పాలు అయ్యే కదా ఆత్మహత్యలు చేసుకొనేది.రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ప్రాణాలు తీసుకుంటారు. రుణమాఫీ చేసి ఉంటే ప్రాణత్యాగం చేసుకోకుండా ఉండే వారు కదా.రైతుబందు అని చెప్పి మిగతా రైతు సంక్షేమ పథకాలు నిలిపి వేశారు.5 వేల కోసం 25 వేలు వచ్చే అన్ని పథకాలు ఆపి వేశారు.

also read :-హత్య చేసిన వారెవరైనా వదిలిపెట్టం

వరి వేసుకోండి అంటారు..మళ్ళీ వద్దు అంటారు.. మళ్ళీ కొంటాం అంటారు.కేసీఆర్ నాలుక కి నరం లేదు..నరం లేని నాలుక కేసీఆర్ ది.ఎన్ని అబద్ధాలు అయినా చెప్పగలడు. ముఖ్యమంత్రి అంటే ఇలానే ఉంటాడా..!రైతు కడుపు న పుట్టడమే శాపం అనే పరిస్థితులు తెలంగాణ లో ఉన్నాయి.రైతు ను పురుగులా చూస్తున్నారు.మనుషులుగా చూడటం లేదు.తెలంగాణ లో అసలు రైతులకు విలువే లేదు.రైతు అంటే అన్నం పెట్టే వాడు..సైనికుని లా పోరాడే వాడు అని అన్నారు.