Telugu News

ఎనిమిదేండ్ల‌లో కేసీఆర్ అభివృద్ధి మ‌రిచి అప్పులు చేసిండు

రైతులు, నిరుద్యోగులు చ‌నిపోతున్నా స‌మ‌స్య‌లే లేవంటూ బుకాయిస్తున్నరు

0

ఎనిమిదేండ్ల‌లో కేసీఆర్ అభివృద్ధి మ‌రిచి అప్పులు చేసిండు

—రైతులు, నిరుద్యోగులు చ‌నిపోతున్నా స‌మ‌స్య‌లే లేవంటూ బుకాయిస్తున్నరు

—- బంగారు తెలంగాణ పేరుతో బార్లు, బీర్ల తెలంగాణ‌గా మార్చిండు

—-కాంగ్రెస్ పార్టీకుఓట్లేస్తే.. టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారు

—- రాష్ట్రంలో వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యం

(తిరుమలాయపాలెం విజయం న్యూస్):-

ప్రజాప్రస్థానంలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండ‌లంలో సోమవారం ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప‌ర్య‌టించారు. సోలిపురం గ్రామంలో ప్ర‌జ‌ల‌తో మాట్లాడి, స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌జ‌లు పెద్ద‌సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి, పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఆ త‌ర్వాత కాకర్వాయి గ్రామంలో పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా కాక‌ర్వాయి మాజీ సర్పంచ్ ఎల్ల‌య్య‌, వైయ‌స్ ష‌ర్మిల స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి వైయ‌స్ ష‌ర్మిల గారు ప్రసంగిస్తూమ‌హానేత వైయ‌స్ఆర్ ప్రారంభించిన పాద‌యాత్ర‌కు కొన‌సాగింపుగానే మేం ప్ర‌జాప్ర‌స్థానం మొద‌లుపెట్టాం అన్నారు

also read :-నేడు ఖమ్మం జిల్లాకు షర్మిళ పాదయాత్ర
వైయస్ఆర్ బిడ్డ వస్తుందని వేలాదిగా తరలివచ్చిన ఖమ్మం జిల్లా ప్రజలకు ప్ర‌త్యేక ధన్యవాదాలు తెలిపారురాష్ట్రంలో పాల‌కులు అస‌లు స‌మ‌స్య‌లే లేవ‌ని, త‌మ ప‌థ‌కాలు అద్భుత‌మ‌నిరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని మా పాదయాత్రలోప్ర‌జ‌లేమో త‌మ‌కు అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఆవేదనతో చెబుతున్నానని ఆమె చెప్పారు .ఎక్క‌డ చూసినా అప్పుల బాధ‌తో రైతులు,ఉద్యోగాలులేవ‌నినిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారని వైఎస్ ఆర్ వారి కుటుంబాలు అనాథలుగా మిగిలారు అని ఆవేద వ్యక్తంచేశారువైయ‌స్ఆర్ప‌రిపాలించిన‌ ఐదేండ్ల‌లో ప్ర‌తి ఒక్క వ‌ర్గానికి న్యాయం చేస్తే.. కేసీఆర్ ఎనిమిదేండ్ల‌లో ప్ర‌తి ఒక్క వ‌ర్గాన్ని మోసం చేసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు
వైయ‌స్ఆర్ పేద‌ల‌కు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని పెట్టడంతో పాటు108, 104 సేవల ద్వారా ఆప‌ద‌లోఉన్న వారిని ఆదుకునేలా, ప్ర‌తి ఇంటికీ ఉచిత వైద్యం అందేలా చేశారని గుర్తుచేశారు

also read :-కోటి ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దే..!

ఉమ్మడి రాష్ట్రంలోపేద‌ల‌కు 46 ల‌క్షల ప‌క్కా ఇండ్లు నిర్మించి, గూడులేని నిరుపేదలకు గూడు కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు
ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు .రైతులకు ఉచిత విద్యుత్ ప్ర‌వేశ‌పెట్టిన మొట్టమొద‌ట ముఖ్యమంత్రి వైయ‌స్ఆర్అని పునరుద్ఘాటించారుపేదింటి బిడ్డలకు ఉన్నత విద్య అందించాల‌ని ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ చేశారు .ఐదేండ్లలోనే మూడు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చి, ల‌క్షల ప్రభుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేశారనిప్రైవేటు రంగంలోనూ 11ల‌క్షల ఉద్యోగాలు సృష్టించి ఉమ్మడి రాష్ట్రంలోబీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేష‌న్ల ద్వారా పేద‌ల‌కు రుణాలు ఇచ్చి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు

also read :-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రిపువ్వాడ..
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు.ఎన్నిక‌లముందురుణమాఫీఅనిరైతులనుమోసంచేశారు.కేజీటుపీజీఉచితవిద్యఅనివిద్యార్థులనుమోసం చేశారు మూడెకరాల భూమిదళిత బందు ఇస్తానని దళితుల్ని మోసం చేశారన్నారు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలనూ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామనిఇంటికో ఉద్యోగమని యువతను నెలకు రూ.3016 నిరుద్యోగ‌ భృతి అని నిరుద్యోగులనూ మభ్యపెట్టి మోసపూరిత వాగ్దానాలు చేశారని ఆమె ధ్వజమెత్తారుపోడు భూముల‌కు ప‌ట్టాలు ఇస్తాన‌నిగిరిజనులు నమ్మించి పోడు భూములు దండుకుంటున్న గిరిజనులను అటవీశాఖ అధికారులతో అక్రమ కేసులు బనాయించి అనేక చోట్ల దాడులు చేశారని ఆమె గుర్తుచేశారు
బంగారు తెలంగాణ పేరుతో బార్లు, బీర్ల తెలంగాణగా మార్చి బంగారు తెలంగాణ పేరుతో అప్పులు, ఆత్మ‌హ‌త్య‌ల తెలంగాణ‌గా మార్చాడన్నారు

also read :-కోటి ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దే..!
ఉద్య‌మ‌కారుడు క‌దా అని ముఖ్య‌మంత్రిని చేస్తే.. వేల మంది రైతులు, నిరుద్యోగుల మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌య్యారని
అటు బీజేపీ రేట్లు పెంచి, ప్ర‌జ‌ల‌పై భారం మోపుతుంటే.. ఇటు కేసీఆర్ తానేం త‌క్కువ అన్న‌ట్లుగా రేట్లు పెంచుతున్నారనిఇరు పార్టీలు క‌లిసి ప్ర‌జ‌ల ర‌క్తం తాగుతున్నారనిఆరోపించారుకేసీఆర్ నియంత‌, అక్రమ పాల‌న సాగిస్తున్నా.. ఏ ఒక్క పార్టీ ప్రశ్నించ‌లేదు. ప్రశ్నిస్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. వారంతా కేసీఆర్ కు అమ్ముడుపోయారు.ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేసేందుకు, ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నించేందుకే మేం వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించాం

మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని వైయ‌స్ఆర్ బిడ్డగా మాటిస్తున్నా.. తెలంగాణ‌లో వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న తిరిగి తీసుకొస్తాంఅన్నారు
బచ్చోడు గ్రామ సెంటర్లో ఏర్పాటుచేసిన మాటాముచ్చటా కార్యక్రమంలో ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా పలువురు యువతీయువకులు తమ ఆవేదనను వెలిబుచ్చారుఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు గట్టు రాంచందర్రావు పిట్ట రాంరెడ్డి సత్యవతి భూమిరెడ్డి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం రమేష్ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్బాబు ఖమ్మం జిల్లా మహిళా

అధ్యక్షురాలు చల్లా ప్రతిభారెడ్డి భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు నేరాల సత్యనారాయణ మహోబా జిల్లా అధ్యక్షురాలు బానోతు సూజాత ఖమ్మం జిల్లా ప్రజా ప్రస్థానం పాదయాత్ర పరిశీలకులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు దేశిరెడ్డి సురేష్రెడ్డి తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు సత్యనారాయణ ఖమ్మం జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు మద్దెల ప్రసాద్ ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు ఆలస్యం రవి షేక్ మస్తాన్ ఖమ్మం రూరల్ రూరల్ మండల అధ్యక్షులు ఎడ్లపల్లి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు