Telugu News

రైతుల పండించిన వడ్లు కొనాల్సిందే

మండలాభివద్ది కోసం అందరం పనిచేద్దాం

0

రైతుల పండించిన వడ్లు కొనాల్సిందే

== మండలాభివద్ది కోసం అందరం పనిచేద్దాం

== మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్

(కూసుమంచి-విజయంన్యూస్);-

యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట ధాన్యం ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కోనాల్సిందేనని, లేకపోతే కొనేవరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ అన్నారు. గురువారం కూసుమంచి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బానోతు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. రైతులు పండించిన ధాన్యంను కేంద్ర ప్రభుత్వం కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మాణం చేసి, ఆ కాఫీని జిల్లా అధికారులకు పంపించాలని మండలాధికారులకు ఆదేశించారు.

also read;-అర్చన శర్మ ఆత్మకు శాంతి చేకూరాలి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాభివద్ది కావాలంటే కచ్చితంగా ఎంపీటీసీ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఐక్యంగా పనిచేయాలని, తద్వారా మండలం మరింతగా అభివద్ది చెందే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మండలాభివద్ది కోసం అద్భుతంగా పనిచేస్తున్నారని, బారీ ఎత్తున నీధులను తీసుకోస్తున్నారని, అన్ని గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు.

also read;-సస్పెండ్ అయినప్పటికి సంతకాలు చేసిన హెచ్ఎం

మండల పరిషత్ సభ్యులకు కూడా నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల అవసరాలను గుర్తించి తమ కు చెప్పాలని, లేదంటే నేరుగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి చెప్పి పనులను , సమస్యలను పరిష్కించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచర్ల పద్మావీరారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఆలీ, మండలాధికారులు హాజరైయ్యారు.