గంగబండతండాకు నీళ్లు ఇప్పించాలని తుమ్మలకు రైతుల వినతి
(కూసుమంచి-విజయంన్యూస్)
కూసుమంచి మండలంలోని గంగబండతండా పంచాయతీతో పాటు మరో మూడు పంచాయతీలకు భక్తరామదాసు నీళ్లను అందించే విధంగా క్రుషి చేయాలని ఆ గ్రామ పంచాయతీలకు చెందిన రైతులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వేడుకున్నారు. బుధవారం ఖమ్మం వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు గంగబండతండా, రావిచెట్టుతండా, లింగరాంతండా తదితర గ్రామాలకు చెందిన రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
also read;-ఆస్తి తగాదాల నేపథ్యంలో సోదరి కుటుంభం పై కత్తులతో దాడి చేసిన సోదరుని కుటుంభం..
గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో తుమ్మల నాగేశ్వరరావు నిర్మాణం చేసిన భక్తరామదాసు పథకం వల్ల మండలంలోని అన్ని గ్రామాలకు నీళ్లు సరఫరా అవుతున్నాయని, కానీ మండలంలోని శివారు గ్రామాలైన నాలుగు పంచాయతీలకు నీరు అందడం లేదని, ఆ గ్రామ పంచాయతీ రైతులు వేడుకున్నారు. ఎన్నికలు జరిగిన అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పిన ఎవరు మా బాధను వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
also read;-అసెంబ్లీలో అవి వాడోద్దంటా..? తెల్చిచెప్పిన స్పీకర్
దీంతో స్పందించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, ఎస్ఆర్ఎస్పీ సీఈ, భక్తరామదాసు ఎస్ఈ లకు పోన్లు చేసి మాట్లాడి నీళ్లను అందించాలని కోరారు. కోర్టు సమస్య ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. దీంతో రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగబండ తండా కు చెందిన రైతు వడిత్య నాగేశ్వరరావు, మాజీ రైతు సమన్వయ సమితి కన్వీనర్ జొన్నలగడ్డ రవి కుమార్, కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, బారి వీరభద్రం, అర్వపల్లి జనార్దన్, బాణోత్ సీతారాముల, అర్వపల్లి సతీష్, మొహమ్మద్ రఫీ, ఎర్రగడ్డ తండా గ్రామస్తులు.