Telugu News

***ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కొత్త నాటకం

బిజెపి నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి

0

***ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కొత్త నాటకం
***బిజెపి నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి

***(ఖమ్మం-విజయంన్యూస్);-
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని బిజెపి తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు ,మాజీ ఎమ్మెల్సీ ,తమిళనాడు రాష్ట్ర పార్టీ కో- ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు .తెలంగాణలో కెసిఆర్ దుకాణంబంద్ కాబోతున్న తరుణంలో ప్రజల ను పక్కదారి పట్టించేందుకు కేసిఆర్ సరికొత్త డ్రామా కు తెరలేపారని ఒక ప్రకటనలో ఆయన దుయ్యబట్టారు .మహరాష్ట్ర లో బిజెపి -శివసేనలకు ప్రజలు అధికారం ఇఛ్చారని కుర్చీ కోసం ఉద్దవ్ ధాకరే కాంగ్రెస్ తో దోస్తీ కట్టిన విషయం అందరికి తెలిసిందే అన్నారు.

also read :-ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తుండగా జరిగిన ప్రమాదం….

కాంగ్రేస్ తో జతకట్టి బాల్ ధాకరే ఆశయానికి శివసేన తూట్లు పొడిచిందన్నారు..రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చిన కేసీఆర్ దేశాన్ని బంగారు భారత్ గాతీర్చి దిద్దుతానని ప్రకటన చేయటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు .దేశ్ కి నేత అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే నని ఆరోపించారు .గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఆడిన డ్రామాలు ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు .స్టాలిన్ మమతా బెనర్జీ శరద్ పవార్ తదితర నాయకులను కలిసినంత మాత్రాన ఒరిగిందేమీ లేదని ఆరోపించారు

.తెలంగాణ ను సర్వ నాశనం చేసిన కేసీఆర్ విచ్ఛిన్నకర శక్తులు ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు .నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా దూసుకెళ్తుంటె ఆయనపై ప్రతిపక్షాలు విషం చిమ్ము తున్నాయని తెలిపారు .సినిమాలలో విలన్ పాత్ర పోషించే ప్రకాష్ రాజ్ ను తీసుకో వచ్చి రాజకీయాలలో కూడా విలన్ పాత్ర పోషించేలా కెసిఆర్ తయారు చేస్తున్నారని విమర్శించారు .ప్రకాష్ రాజ్ సినిమా ఉనికి కోసమే కెసిఆర్ చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారని ధ్వజ మెత్తారు .రాబోయే రోజుల్లో కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని వెల్లడించారు.దేశం లేని స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ లపైనా కేసిఆర్ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని విమ్మర్శించారు..