Telugu News

సీఆర్పీల సమస్యలు పరిష్కరించండి…

మధిరలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి వినతి..

0

సీఆర్పీల సమస్యలు పరిష్కరించండి…

మధిరలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి వినతి..

(మధిర విజయం న్యూస్):-

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని సీఆర్పీలు కోరారు. మధిరలో జరుగుతున్న ఉపాధ్యాయుల ట్రైనింగ్ సెంటర్ కు వచ్చిన ఎమ్మెల్సీకి గురువారం సీఆర్పీలు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు.

also read :-గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి ఇంటింట ప్రదర్శన

పది సంవత్సరాలు అరకొర జీతంతో పనిచేస్తున్నామని స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అదేవిధంగా టీఏ చెల్లించాలని, పీఎఫ్, హెల్త్ కార్డులు అందించాలన్నారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్.. పేరును క్లస్టర్ రిసోర్స్ టీచర్ గా మార్చాలని కోరారు. త్వరలో జరిగే డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన సీఆర్పీలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు.

సమస్యలను విన్న ఎమ్మెల్సీ ప్రభుత్వం 11 వేల మందిని క్రమబద్ధీకరించడానికి చూస్తుందని అన్ని డిపార్ట్ మెంట్స్ నుంచి ఒత్తిడి పెంచడం వలన ఈ సంఖ్య మారబోతుందన్నారు. అన్ని సమస్యల పై త్వరలోనే విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్సీలతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని కచ్చితంగా న్యాయం చేసేలా ప్రయత్నం చేస్తానన్నారు. సీఆర్పీలు ఐక్యత చాటాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఆర్పీఏ జిల్లా సెక్రటరీ కే బాబురావు, సీహెచ్ ప్రభాకర్ రావు, స్వప్నరాణి, నాగేశ్వరరావు, వై జయకర్, ఎం ప్రవీణ్ పాల్గొన్నారు.