Telugu News

కాంగ్రెస్ లో దరఖాస్తుల వెల్లువ

0

కాంగ్రెస్ లో దరఖాస్తుల వెల్లువ

== ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు దరఖాస్తులు చేస్తున్న నేతలు

== దరఖాస్తు చేసిన పొడేం వీరయ్య, మట్టాదయానంద్ దంపతులు

== పాలేరుకు ఎడ్ల శ్రీరామ్ యాదవ్, మద్ది శ్రీనివాస్ రెడ్డి, బెల్లం శ్రీనివాస్ దరఖాస్తు

== నేడు భారీ ర్యాలీగా గాంధీభవన్ కు రాయల

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు, ఆశావాహులు ఎక్కువైయ్యారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు టిక్కెట్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా పనిచేసిన వారితో పాటు కీలక నాయకులుగా ఉన్న వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలుగా బరిలో నిలిచినవారు, ఎమ్మెల్సీలు  ముఖ్యనాయకులు, టిక్కెట్ ను ఆశించేవారందరు దరఖాస్తులు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:- జలగం దారేటు..?

దీంతో ఆశావాహులు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర రాజదానికి పరుగులు తీస్తున్నారు. కొంత మంది నాయకులు జనబలంతో కార్లర్యాలీతో వెళ్లి దరఖాస్తులు చేస్తుండగా, మరికొంత మంది నిశబ్ధంగా వెళ్లి దరఖాస్తు చేసి వస్తున్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఎమ్మెల్యే పోడేం వీరయ్య దరఖాస్తు చేసుకోగా, కొత్తగూడెం నుంచి కొత్త సీతారాములు, యడవల్లి క్రిష్ణ దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఇల్లందు నుంచి జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, పాలేరు నుంచి పీసీసీ సభ్యులు ఎడ్ల శ్రీరామ్ యాదవ్ దరఖాస్తు చేయగా, పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, యువజన నాయకుడు రాంరెడ్డి చరణ్ రెడ్డి  దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాలకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు దరఖాస్తులు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం పొలిటికల్ లో విచిత్రం..?

కాగా ఇటీవలే కుల ద్రువీకరణ పత్రాన్ని కోల్పోయిన సత్తుపల్లి నాయకులు మట్టా దయానంద్ కూడా కాంగ్రెస్ టిక్కెట్ కావాలని గాంధీ భవన్ లో దరకాస్తు చేసుకున్నారు. ఆయన తో పాటు ఆయన సతిమణి రాగమయి సత్తుపల్లి టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు పారంను కల్తి వెంకటేశ్వర్లు (వెంకట్) దరఖాస్తు చేసుకున్నారు.

== నేడు రాయల భారీ ర్యాలీ

పాలేరు నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశిస్తున్న పాలేరు నియోజకవర్గ పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు తనకు టిక్కెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం 6గంటలకు కూసుమంచి నుంచి భారీ కార్ల ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నడుమ ఆయన గాంధీభవన్ కు వెళ్లి దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. వందలాధి మంది కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లనున్నారు.