Telugu News

కేటీఆర్ ఖమ్మం పర్యటనకు సర్వం సిద్ధం

మంత్రి అజయ్ పర్యవేక్షణలో అధికారుల ఏర్పాట్లు

0

కేటీఆర్ ఖమ్మం పర్యటనకు సర్వం సిద్ధం

★ మంత్రి అజయ్ పర్యవేక్షణలో అధికారుల ఏర్పాట్లు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( కేటీఆర్ ) పర్యటనకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండు మూడు రోజులలో పూర్తి పర్యటన వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్వహించతలపెట్టిన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతో పాటు రఘునాథపాలెం మండలంలోని పలు అభవృద్ధి కార్యక్రమాలలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.

also read;-సారాను అరికట్టమని అడిగితే అసెంబ్లీలోకి వద్దంటూ వెళ్లగొట్టస్తేన్నరు

రూ.8.50 కోట్లతో నగరప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన కేబుల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. ఇప్పటికే నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో దాదాపు రూ.1000 నుంచి రూ.1500 కోట్లతో అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఖమ్మం నగరంలో రూ.230 కోట్లతో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధజలం అందజేస్తున్నారు. రూ.70 కోట్లతో గోళ్లపాడు ఛానల్‌ ఆధునీకరణ పనులు చేపట్టారు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా అందిస్తున్న రూ.100 కోట్ల ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో సాగుతున్నాయి. నగరంలో దాదాపు రూ.200 కోట్లతో 2వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించారు. రఘునాథపాలెం మండలంలో రూ.75 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టారు, నగరం నుంచి బోనకల్లు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రూ.70 కోట్లతో ధ్వంసలాపురం వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జిని నిర్మించారు.

also read;-కాంగ్రెస్ సమస్యలపై రాహుల్ గాంధీ నజర్

ఖమ్మం నగరంతోపాటు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరిగింది. ఇప్పటికే ఖమ్మంలో ఆధునిక వసతులతో ఆర్టీసీ బస్టాండ్‌, ఐటీ హబ్‌, సమీకృత కూరగాయల మార్కెట్‌, నగరంలో అంతర్గత రహదారుల విస్తరణ వంటి పనులతో నియోజకవర్గం అగ్రగామిగా ఉంది. మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించి నూతనంగా 15 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో నిర్మించిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనాన్ని, టేకులపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఐటీ హబ్ నుంచి కలెక్టరేట్ వరకు ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లను ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఎఫ్ఎస్టీపి ను, రఘునాథపాలెం బృహత్ పల్లె ప్రకృతి వనం తదితర అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ధ్వంసలాపురం వద్ద రూ.30 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.