Telugu News

ఫారెస్ట్ అధికారులు ఆదివాసి పోడు భూములు జోలికి వస్తే ఊరుకోం

చర్ల ----- విజయం న్యూస్

0

ఫారెస్ట్ అధికారులు ఆదివాసి పోడు భూములు జోలికి వస్తే ఊరుకోం

(చర్ల —– విజయం న్యూస్);-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్న మిడిసిలెరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తిమ్మిరి గూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు హరితహారం పేరుతో కందకాలు తవ్వడానికి వచ్చన అధికారులను కందకాలు తవ్వుతున్న జెసిబి లను తిమ్మిరి గూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు.

also read ;-ముందస్తు పై ఊహాగానాలు……

వీరు సుమారు 40 సంవత్సరముల నుండి ఈ ఆదివాసీల పోడు రైతులు సాగు చేసుకుంటున్నామని, గతంలో ఫారెస్ట్ అధికారులు మా పై కేసులు పెట్టడం జరిగిందని, జైలుకు కూడా వెళ్ళి వచ్చామని ఇప్పుడు అధికారులు మాపై పగబట్టినట్లుగా మా భూములను లాకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా గాని మా భూములను వదలబోనని అవసరం అయితే మరలా జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని, ఆదివాసీ పోడు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మడవి మసయ్య, మడకం రఘు, మస్కి ఆడమయ్య, కట్టం రాము, సోడి ఐతయ్య తదితరులు పాల్గొన్నారు.