Telugu News

దేవాలయాలపై దాతృత్వం చాటుకున్న మాజీ ఎంపీ పొంగులేటి

(ఖమ్మం:విజయం న్యూస్

0

దేవాలయాలపై దాతృత్వం చాటుకున్న మాజీ ఎంపీ పొంగులేటి

(ఖమ్మం:విజయం న్యూస్ ):-
జిల్లాలోని దేవాలయాలపై తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు విరాళాలను అందజేశారు.

also read :-ఈనెల 26న ఖమ్మంకు రేవంత్ రెడ్డి

తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో నిర్మిస్తున్న గంగమ్మ గుడికి రూ.2లక్షలను, కామేపల్లి మండలంలోని బాసిత్ నగర్ లోని రామాలయానికి రూ. 50వేలు, కూసుమంచి మండలం లాల్ సింగ్ తండా, సంధ్యా తండాలోని బొడ్రాయి, ఆంజనేయస్వామి దేవాలయాలకు రూ.50వేలు, కొణిజర్ల మండలంలోని గద్దలగూడెంలోని రామాలయానికి రూ. 25వేలు, ఇల్లందులోని మిట్టపల్లి గ్రామంలోని సంత్ సేవాలాల్ దేవాలయానికి రూ.25వేలు, రఘునాథపాలెం మండలం పరికలగూడెం తండాలోని ఆంజనేయస్వామి దేవాలయానికి రూ.35వేలను విరాళంగా అందజేశారు.