తెలంగాణలో మహిళా సాధికారతకే అగ్రతాంబూలం :పొంగులేటి
– మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-జూలూరుపాడు లోని ఆర్ కే గార్డెన్స్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
-వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామణులను సన్మానించిన పొంగులేటి
(జూలూరుపాడు విజయం న్యూస్):-
తెలంగాణలో మహిళా సంక్షేమానికి, సాధికారతకే సీఎం కేసీఆర్ అగ్రతాంబూలం వేస్తున్నారని ఇది యావత్తు తెలంగాణ మహిళా సోదరీమణులందరూ గర్వించదగిన పరిణామమని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
also read :-రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి…
మహిళా దినోత్సవాన్ని పురస్కరించకుని జూలూరుపాడులోని ఆర్ కే గార్డెన్స్ లో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓ తల్లిగా.. ఓ ఆలిగా.. ఆడబిడ్డగా… కోడలిగా తన సమర్థవంతమైన కుటుంబ బాధ్యతను నిర్వహిస్తునే మరోవైపు సమాజంలోనూ తన ప్రత్యేకమైన ముద్ర వేసుకునేందుకు ప్రతీ మహిళా వివిధ రంగాల్లో రాణించడం శుభపరిణామమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఏడున్నరేళ్లలో మహిళల ఆర్థిక వెసులుబాటుకు ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు తెలంగాణ ఆడబిడ్డలకు వరంగా ఉపయోగపడుంతుందన్నారు.
also read :-కల నేరవేరిన వేళ
అలాగే ప్రత్యేక పాఠశాలలు, హాస్టళ్ల ఏర్పాటు విద్యార్థినుల అదృష్టంగా భావించవచ్చని పేర్కొన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, మున్సిపల్ ఛైర్‌పర్సన్, మేయర్, కార్పొరేటర్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా మహిళలకే పెద్దపీట వేసిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
వీటితో పాటు ఇతర రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహిస్తుండటం ప్రతిఒక్కరూ గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. అనంతరం వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామణులను పొంగులేటి ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మండల నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కోసూరి శ్రీను, రాయల పుల్లయ్య, రాధాకృష్ణ, దారావత్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ స్పూర్తితో ముందుకు సాగుదాం..!
-మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-వినోభానగర్ లో అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరు
జూలూరుపాడు: అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరం ముందుకు సాగాలని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వినోభానగర్ లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణకు మంగళవారం పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అన్నివర్గాలతో పాటు ప్రత్యేకంగా దళితులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారు అన్నిరంగాల్లోనూ రాణించేలా తగిన ప్రోత్సాహాన్ని అందజేస్తున్నారని తెలిపారు.
also read :-సండ్ర నీ తీరు మార్చుకో..సండ్ర పై స్వంతపార్టీ నేతల ఫైర్
ఇదే క్రమంలో దళితబంధు లాంటి పథకాలను పెట్టారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఈ పథకం ప్రవేశపెట్టాక అనేకమంది ప్రశంసలు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు లభించాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ పల్లె, పట్టణంతో పాటు మారుముల గ్రామాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మండల నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కోసూరి శ్రీను, రాయల పుల్లయ్య, రాధాకృష్ణ, దారావత్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు