Telugu News

పినపాకలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన…..

భారీ కాన్వాయ్ తో శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం....

0

పినపాకలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన…..

భారీ కాన్వాయ్ తో శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం….

(మణుగూరు,/ అశ్వాపురం, విజయం న్యూస్):-

పినపాక: శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పినపాక నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. నియోజకవర్గానికి పొంగులేటి విచ్చేసిన సందర్భంగా తొలుత పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద భారీ కాన్వాయ్ తో ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలోని గంగిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా అతన్ని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

also read :-అగ్ని ప్రమాద బాధితులకు అండగ ఉంటాం

అదేవిధంగా గట్ల బాలరెడ్డి రమణ దంపతుల కుమారుడు నవీన్ రెడ్డి – సాహితీలకు ఇటీవల వివాహాం జరిగింది. ఈ సందర్భంగా కొత్త జంటను వారి ఇంటి వద్దకు వెళ్లి ఆశ్వీరదించారు. నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. అనంతరం అశ్వాపురం మండలం అమెర్ధ గ్రామంలోని కొర్ష.రామారావు అనే వ్యక్తి కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఈరోజు వారి ఇంటికి వెళ్లి వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది అన్నారు అనంతరం అశ్వాపురం మండలం నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షులు తుక్కాని మధుసూధన రెడ్డి తల్లి రామ నర్సమ్మ గారి ప్రధమ వర్థంతి మరియు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

also read :-రైతులకు కోడి పిల్లలు పంపిణీ చేసిన శాస్త్రవేత్తలు

ఈ పర్యటనలో పొంగులేటి వెంట పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత , జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ రెడ్డి ,గోపిరెడ్డి,గజ్జెలలక్ష్మారెడ్డి,సొసైటీ డైరెక్టర్ కసరబాధ సందీప్,జిల్లా కో అప్సన్ సబ్యలు షరీఫ్ ఉద్దీన్,మండల కో-అప్సన్ సభ్యులు.ఖదీర్, నెల్లిపాక సహకార సంఘం డైరెక్టర్లు ,ఎం పి టి సి లు, టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు, తదితరులు భారీసంఖ్యలో పాల్గొన్నారు.