Telugu News

నేటినుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర

హైదరాబాద్‌-విజయంన్యూస్

0

నేటినుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర
(హైదరాబాద్‌-విజయంన్యూస్):-
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను షర్మిల మొదలు పెట్టనున్నారు. ఉదయం 11.30 గంటలకు లోటస్‌ పాండ్‌ నుంచి భారీ కాన్వాయ్‌లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి కొండపాక గూడెంకు చేరుకోనున్నారు. శుక్రవారం కొండపాక గూడెం నుంచి నార్కట్‌ పల్లి వరకు 5 కిలేమేటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. అనంతరం సాయంత్రం నార్కట్‌ పల్లిలో భారీ భహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. రైతులకు, నిరుద్యోగుకలు మద్దతుగా మాఎ ఈ యాత్రచేపట్టారు.