Telugu News

ఓట్లు వేయించుకోవడం.. ఫామ్ హౌజ్లో పండుడే

= కేసీఆర్ కు పాలన పట్ల చిత్తశుద్ది లేదు

0

ఓట్లు వేయించుకోవడం.. ఫామ్ హౌజ్లో పండుడే

== కేసీఆర్ కు పాలన పట్ల చిత్తశుద్ది లేదు

== ఆత్మగౌరవాన్ని తొక్కేస్తున్నరు

== కేసీఆర్ ను చూసి ప్రజలు మోసపోయారు

== పాదయాత్ర సందర్భంగా జరిగిన సభలో సీఎంపై ద్వజమెత్తిన షర్మిళ

== ఆశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల గారు మాట – ముచ్చట

(భద్రాద్రికొత్తగూడెం -విజయంన్యూస్);-

ఓట్లు వేయించుకోవడం ఫామ్ హౌజ్ లో పండుకోవడమే సీఎం కేసీఆర్ కు తెలుసని, మళ్లీ ఎన్నికలు రాగానే మాయమాటలతో, మాటలగారడితో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం మళ్లీ ఫామ్ హౌజ్ కు పోవడే ఆయన పని అని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిళ సీఎం కేసీఆర్ పై ద్వజమెత్తారు. మహాప్రస్తానం పేరుతో ప్రారంభించిన పాదయాత్ర భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురంలో కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిళ మాట్లాడుతూ

also read :-క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించిన మాజీ ఎంపీ పొంగులేటి

కేసీఆర్ ఉద్యమ కారుడు.. గొప్పగా పరిపాలన చేస్తాడు అనుకున్న

-. నాతో పాటు ప్రజలు కూడా మోసపోయారు

-. పేదవాడికి సహాయ పడాలని చిత్తశుద్ది కేసీఆర్ కి లేదు

-. అంతా దోచుకోవడం,దాచుకోవడం

-. ఆత్మ గౌరవాన్ని ఎడమ కాలి చెప్పు కింద వేసి తొక్కుతున్నారు

-. ఇదేనా కేసీఆర్ బంగారు తెలంగాణ

-. 8 ఏళ్లుగా మనకు ఏం చేశాడు అని ఆలోచన చేయండి

-. వైఎస్సార్ పాలన ఎలా ఉంది…ఇప్పుడు కేసీఆర్ పాలన ఎలా ఉంది

-. కేసీఆర్ కి తెలిసింది ఒక్కటే ఎన్నికలప్పుడు గారడీ మాటలు

-. ఓట్లు వేయించుకోవడం… ఫాం హౌస్ కి వెళ్లిపోవడం

-. ప్రతి వర్గాన్ని మోసం చేశారు కేసీఆర్

-. టీఆరెఎస్ పాలన లో మన రాష్ట్రం దొంగల రాజ్యం..రౌడీ రాజ్యాంగ మారింది

-. పోలీస్ లను తమకోసం పనొల్లుగా వాడుకుంటున్నారు

-. సహాయం అడిగితే టీఆరెఎస్ నాయకులు మహిళల మానాలను అడుగుతున్నారు

-. నడిరోడ్డు మీద న్యాయవాదులను నరికి చంపేశారు

-. ఎవరు పట్టించుకున్నారు…ఎక్కడుంది న్యాయం

-. ఇది గూండాల రాజ్యం కాకపోతే మరేంటి..

-. ఇది ప్రజాస్వామ్యం కా ఎవరికి కనిపిస్తుంది

-. ప్రజలు అప్పుల పాలు అవుతున్నాం…సహాయం చేయండి అని అడిగితే ఎవరు చేస్తున్నారు..

-. ఇదేనా బంగారు తెలంగాణ..

-. కేసీఆర్ చేతిలో పాలన పెడితే పేదలకు బతుకే లేని తెలంగాణగా మార్చారు

-. బార్ల తెలంగాణ..బీర్లు తెలంగాణ గా మార్చారు

-. ఆడవారికి రక్షణ లేదు.. కనీసం చిన్న పిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేదు

-. మహిళల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి ఉరి వేసుకోవాలి

-. నా గతం ఇక్కడే..నా భవిష్యత్ ఇక్కడే

-. ఇక్కడే పుట్టిన..ఇక్కడే పెరిగినా

-. ఈ గడ్డకు సేవ చేసే హక్కు నాకు ఉంది

-. మా పార్టీ లో ,పార్టీ జెండా లో వైఎస్సార్ ఉన్నాడు

-. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తో సుపరిపాలన సాధ్యం

-. వైఎస్సార్ బిడ్డ గా మాట ఇస్తున్న

-. సాగు చేసుకున్న పోడు భూములు ఎప్పటికీ మీవే

-. ప్రభుత్వం వచ్చాకా ఆ భూములకు పట్టాలు మీ చేతుల్లో పెడతా