గిదేంది సారూ..? మా పొట్టకొట్టకుండ్రీ..
== పాస్ బుక్ లున్న భూమి లీజుకేట్టిస్తరు..
== పాస్ పుస్తకాలున్న దళిత భూములను లీజుకిచ్చిన జిల్లా పెద్దసార్లు
== ఆ భూమిలో మట్టి తోలేందుకు జేసీబీ,టీప్పర్లను తెచ్చిన హైవే కాంట్రాక్టర్
== మా భూమి సారో..? మమ్మల్ని వదిలేయ్యూర్రి అంటూ మొత్తుకున్న బాధిత దళిత కుటుంబాలు
== మొండిగా పట్టుబడుతుండటంతో జేసీబీలకు అడ్డంగా నిలబడిన బాధితులు
== మా భూముల్లో మట్టితోలకాలు చేయోద్దని వినతి చేసిన బాధితులు
== పాస్ పుస్తకాలు, పట్టాలను పరిశీలిస్తున్న తహసీల్దార్
(కూసుమంచి-విజయంన్యూస్)
వాళ్లు దళితులు.. అత్యంత నిరుపేదలు.. రోజు కూలీ పనులు చేసుకుంటే కడుపునిండే పరిస్థితి.. నిత్యం కూలీ పనులకు వెళ్తున్న దళితులు భూముల్లో బోర్లు వేసుకోలేక, సాగుకు నీళ్లు లేక అలా వదిలేశారు..అయితే అళ్లకు బాజాప్తుగా పట్టాలున్నాయ్.. తెలంగాణ సర్కార్ ఇచ్చిన కొత్త పాస్ పుస్తకాలు కూడా ఉన్నయ్.. అయినప్పటికి జిల్లా నీటిపారుదలశాఖ సార్లూ దళితులకు పాస్ పుస్తకాలున్న భూములను హైవే కాంట్రాక్టర్లకు లీజుకిచ్చిండ్రూ.. ఇంకేముంటుంది.
also read;-జీళ్ళచెరువు వెంచర్ పై అధికారుల నజర్
కాంట్రాక్టర్ జేసీబీ, టిప్పర్లతో మట్టితోలేందుకు రానే వచ్చిండ్రు.. మట్టి కొ ద్దిగా తోలుతుంటే ఈ సంగతి ఎరకజేసుకున్న బాధిత దిళితులు ఊరుకూరుకా అక్కడికి వచ్చిండ్రు. గీ భూమి మాది.. మా తాతల కాడనుంచి వస్తాంది.. గిదేంది మీరు మాకు తెల్వకుండా మట్టితోలుతుండ్రూ అంటూ అక్కడ పనిచేసిటోళ్లను అడిగిండ్రు.. మాకు ఇరిగేషన్ సార్లు మాకు ఈ భూమిని లీజుకిచ్చిండ్రూ.. అందుకే మట్టి పోసేటందుకు అనుమతి తీసుకుని తోలుతున్నమని వాళ్లు చెప్పేసరికే బాధితులు లబోదిబోమని కూసుమంచి రెవెన్యూసార్లకు పోన్ చేసిండ్రూ. వాళ్లు కూడా అట్టనే మాట్లాడేసరికి జేసేది లేక మట్టి తోలకుండా అడ్డంగా కుర్చున్నరు.. గిది మా భూమి.. మీరు గీ భూమిలో మట్టితోలుడే లేదని కుర్చున్నరు. దీంతో కాంట్రాక్టర్ తరుపోళ్లు మళ్లీ జిల్లా అధికారులకు పోన్లు జేసిండ్రూ. కాగా బాధితులు విజయం పత్రిక విలేకరి చెప్పగా వెంటనే వెళ్లి అక్కడ పరిస్థితిని తెలుసుకోగా, సంబంధిత విషయాన్ని రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కు చెప్పి, వాళ్లను తహసీల్దార్ వద్దకు పంపించగా, తహసీల్దార్ బాదితుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, పట్టాలను పరిశీలిస్తున్నరు. గిదంతా కూసుమంచి మండలం, జుజ్జులరావుపేటలో జరిగింది.
అసలు ఈ కథేందో చూద్దాం పారీ..
కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన దళితులకు 50ఏళ్ల కిందట ఆనాటి సర్కార్, ఎస్సీల కుంట(మాదిగకుంట) లోతట్టు భూమిని వాళ్లకు కేటాయించింది. మొత్తం 4.12 ఎకరాలకు సంబంధించిన సర్కార్ భూమిని దాట్ల చిన్న గురవయ్యకు, వాళ్ల కుటుంబ సభ్యులకు కేటాయించింది. దీంతో ఆ నాటి నుంచి పట్టాదారులు, కాస్తుదారులుగా వస్తున్నారు. అయితే తెలంగాణ సర్కార్ వచ్చిన తరువాత గురవయ్య మనవళ్లు, కుమారులు భూములను పంచుకోగా, ఎవరికివారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా వారికి తెలంగాణ సర్కార్ నూతన పాస్ పుస్తకాలు ఇచ్చింది.
జుజ్జులరావుపేట రెవెన్యూ పరిధిలోని 38/1/అ సర్వే నెంబర్ లో తుడుం వీరస్వామికి 2.18 ఎకరాలు, 38/1/ఆ లో తుడుం పొన్నం కు 18 కుంటలు, 38/1/ఇ లో దాట్ల చంద్రయ్యకు 28 కుంటల భూమి, 38/1/ఈ లో దాట్ల వెంకన్నకు 28 కుంటలు, 38/2/అలో కిన్నెర నర్సమ్మకు 20 కుంటల భూమికి తెలంగాణ ప్రభుత్వం నూతన పాస్ పుస్తకాలు ఇచ్చింది. కాగా అది కుంట ప్రాంతం కావడం, నీటి వసతి లేకపోవడంతో దళితులు వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే వ్యవసాయం సాగు చేసుకుంటున్నారు. ఆతరువాత నీటి వసతి లేనప్పుడు భూములను అలా వదిలేస్తున్నారు.
== దళితుల భూమిని లీజుకిచ్చిన అధికారులు
బాజాప్తుగా పట్టా, పాస్ పుస్తకాలు ఉన్న దళితుల భూములను ఖమ్మం జిల్లా ఇరిగేషన్ అధికారులు, సంబంధిత అధికారులు హైవే కాంట్రాక్టర్లకు లీజుకు ఇచ్చారు. నేషనల్ హైవే నిర్మాణం కోసం కావాల్సిన మట్టిని ఆ భూమి నుంచి తవ్వకుని హైవేను నిర్మాణం చేసేందుకు అనుమతిని ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కాంట్రాక్టర్ కు సంబంధించిన వారు జేసీబీలు, టిప్పర్లతో అక్కడికి రావడం, దళితులకు ఆ విషయం తెలుసుకుని అడ్డుపడటం జరిగింది.
also read;-వైఎస్ షర్మిల మీద తేనెటీగల దాడి
అయితే పక్కా పాస్ పుస్తకాలు ఉండి, దళితులకు సంబంధించిన భూములను జిల్లా ఉన్నతాధికారులు గుత్తేదారులకు లీజ్ కు ఇవ్వడం గమనర్హం. కుంటకు సంబంధించిన సర్వే నెంబర్ ఏంటో కూడా తెలియని పరిస్థితిలో అధికారులు ఉన్నారా..? లేదంటే చెక్ చేసుకోకుండా అనుమతిని ఇచ్చారా..? అనేది తెలియదు కానీ, దళితుల భూములను సర్కార్ భూమిగా గుత్తేదారులకు లీజ్ కు ఇవ్వడం పట్ల బాధితులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
== పట్టాలను పరిశీలించిన తహసీల్దార్ శిరీషా
జుజ్జులరావుపేట గ్రామంలో దళితులకి సంబంధించిన భూమిని జిల్లా ఉన్నతాధికారులు సర్కార్ భూమిగా ద్రువీకరిస్తూ నేషనల్ హైవే కాంట్రాక్టర్లకు లీజ్ కు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కాంట్రాక్ట్ కు సంబంధించిన వారు ఆ భూముల్లో జేసీబీలతో మట్టి తరలించేందుకు ప్రయత్నించగా, బాధిత దళితులు అడ్డుపడ్డారు. జేసీబీలను, టిప్పర్లను నడవనీవ్వకుండా అడ్డుకున్నారు. ఆందోళన చేశారు.ఇది మా భూమి, మా భూమిలో మట్టి తోలడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు దళితులను పట్టించుకోకుండా మాకు ప్రభుత్వాధికారులు అనుమతిని ఇవ్వడం జరిగిందని చెప్పి పనులు చేయించుకునేందుకు ప్రయత్నం చేశారు. కాగా దళితులు అడ్డుపడ్డారు. ఈ విషయం విలేకర్లకు చెప్పగా, సంఘటన స్థలానికి చేరుకున్న కొందరు విలేకర్లు బాధితులకు సంబంధించిన పట్టాలు, పాస్ పుస్తకాలను పరిశీలించి నేరుగా తహసీల్దార్ కార్యాలయంకు పోన్ చేసి మాట్లాడారు..
also read :-కాంగ్రెస్ సమస్యలపై రాహుల్ గాంధీ నజర్
ఒక సారి పరిశీలించాలని చెప్పడంతో బాధితులు కూసుమంచి తహసీల్దార్ వద్దకు పాస్ పుస్తకాలు, పట్టాలను తీసుకెళ్లి కలిసి వాటిని ఆమెకు అందజేశారు. కాగా తహసీల్దార్ ఆన్ లైన్ లో చెక్ చేసి అనంతరం ఆదేశిస్తానని వారికి చెప్పారు. కాగా నేను చెప్పే వరకు ఆ భూమి మీదకు వెళ్లోద్దని తెల్చిచెప్పినట్లు బాధితులు తెలిపారు. మాకు సహాకరించినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు బాధితులు. చూడాలి. తహసీల్దార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?
== మా తాతల నుంచి ఈ భూమిని చేసుకుంటునాం : దాట్ల చంద్రయ్య, బాధితుడు
జుజ్జులరావుపేట గ్రామ శివారులో గత 50ఏళ్ల క్రితం మా తాత దాట్ల చిన్న గురవయ్యకు ఆనాటి సర్కార్ 4.20 ఎకరాల భూమిని పంపిణి చేసింది. అప్పటి నుంచి మాకు పట్టాలు, పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఆ తరువాత కేసీఆర్ వచ్చిన తరువాత కొత్త పాస్ పుస్తకం కూడా ఇచ్చిండ్రు. మేము బాగాలు పంచుకోగా నాకు 18 కుంటల భూమి వచ్చింది. ఆ భూమికి కొత్త పాస్ పుస్తకం ఉంది. మా అన్నదమ్ముళ్లఅందరికి పాస్ పుస్తకాలు ఉన్నాయి. అప్పటి నుంచి భూమిని దున్నుకుని సాగు చేసుకుంటున్నం
== మా భూమి అని చెప్పిన వాళ్ల అట్టనే వచ్చి మట్టి తవ్వున్నరు : దాట్ల నర్సమ్మ, బాధితురాలు
జుజ్జులరావుపేట గ్రామ శివారులో మాకు భూమి ఉంది. మా నాన్నకు పాస్ పుస్తకం కూడా ఉంది. ఆ భూమిలో మట్టి తోలేందుకు వచ్చిండ్రు. ఇది మా భూమి అని చెప్పినం. అయిన మాకు పరిమిషన్ ఉంది, మేము గిట్లనే తోలతం అన్నరు. ఎట్టా తోలుతరో తోలుర్రీ అంటూ రోడ్డు మీదనే కుర్చనం. మా భూమిని వాళ్లకు ఎటా కిరాయికి ఇత్తరో మాకర్థం కాట్లే. పెద్ద సార్లు మాకు న్యాయం చేయూర్రి. మీకు పున్యముంటది.. మేము పేదోళ్లం మాకు అన్యాయం చేయకుర్రీ సారూ..?