***కలెక్టర్ సారూ.. మా భూమి పై మాకు హక్కు కల్పించండి
***హక్కు దారులకు భూమి అందకుండా చేస్తున్న రెవెన్యూ అధికారులు
***కలెక్టర్ సారూ.. మా భూమి పై మాకు హక్కు కల్పించండి
***హక్కు దారులకు భూమి అందకుండా చేస్తున్న రెవెన్యూ అధికారులు
***అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాము అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న భాదితులు
***(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ ):-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మా భూమి మాకు ఇప్పించి మాకు న్యాయం చెయ్యండని పట్టాదారు
మహమ్మద్ అబ్దుల్ మజీద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిధిలోని సారపాక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మహమ్మద్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సంజీవ్ రెడ్డి పాలెం గ్రామంలో సర్వే నెంబర్ 292 లో నాలుగు(4) ఎకరాల భూమి, సర్వే నెం. 288/అఅ లో 1/2 ఎకరం భూమి, సర్వే నెం.430 లో 6 ఎకరాల 13 కుటల భూములకు బూర్గంపాడు తహశీల్దార్ కార్యాలయం నుండి 12-10- 1976 లో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని పేర్కొన్నారు.
also read :-రాజేంద్రనగర్ మానస హిల్స్ పై సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది.
పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ 120, పట్టా నెంబర్ 340 గా తహశీల్దార్ కార్యాలయం నుండి పట్టా పాస్ బుక్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇట్టి భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని బాధితులు మహమ్మద్ అబ్దుల్ మజీద్ తెలిపారు. పైన తెలిపిన సర్వే నెంబర్లు గల్ భూమిపై మాకు వారసత్వ అధికారాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు పలువురు మముల్ని ఇబ్బందులు పేడుతున్నారని ఆరోపించారు. తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తి, తన భార్య కి మామా పసుపు కుంకుమ పేరుతో ఇచ్చిన భూమిని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు.