ఘనంగా బి జె పి 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హాజరైన రాష్ట్ర నాయకులు సునిల్ రావు
(వాజేడు విజయం న్యూస్):-
భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు కందుల రామ్ కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర నాయకులు పొలుసాని సునిల్ రావు, భూపాలపల్లి జిల్లా దళిత మోర్చా ఇంచార్జి జాడి వెంకట్ సమక్షంలో కందుల రామ్ కిషోర్ జండా ఆవిష్కరణ చేశారు.
also read ;-అది క్షుద్ర పూజ కాదు..గిరిజన పూజ
ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల ప్రజలు రాష్ట్ర నాయకుల సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిని రాష్ట్ర నాయకులు బిజెపి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సాగి సీతారామరాజు, యాలం సుబ్బయ్య, మండల ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన రవీందర్, బడే షణ్ముఖరావు, మండల ఉపాధ్యక్షులు నాగరాజు, శివ, జగపతిబాబు, నవీన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లె పార్వతి, పెద్ధి హరిణి, తిరుపతమ్మ, స్వప్న, రాజేశ్వరి, నాగమణి, ప్రమీల, సోషల్ మీడియా కన్వీనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.