Telugu News

రవాణా మంత్రి ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల గోస

==సమస్యలు అడిగి తెలుసుకున్న మహమ్మద్ జావిద్

0

==రవాణా మంత్రి ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల గోస
==సమస్యలు అడిగి తెలుసుకున్న మహమ్మద్ జావిద్
==(ఖమ్మం-విజయం న్యూస్);-
మహమ్మద్ జావిద్ మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం ఖమ్మం కొత్తబస్టాండ్ నుండి శ్రీ శ్రీ సర్కిల్ వరకు దాదాపు సుమారు 100 నుండి 150 బస్సులు రోడ్డుమీద డీజిల్ కొరకు బారులు తిరి ఉన్నాయి, ఈ సమస్య పై ఖమ్మం డిపో మేనేజర్, రీజనల్ మేనేజర్ కి ఫోన్లో సంప్రదించగా తమ డిపో లో దొరికే డిజిల్ కంటే బయట నాలుగు రూపాయలకు తక్కువకు దొరుకుతుందని తెలియజేశారు,

also read :-లిఫ్ట్ అడిగి.. గన్ తో బెదిరించిటైర్ల లారీ దోపిడీ ఒక రౌండ్ కాల్పులు

ఈరోజు ఎనిమిది గంటలకు డ్యూటీ దిగి వెళ్లవలసిన డ్రైవర్ సోదరులు రాత్రి 11 గంటల వరకు రోడ్లమీద డీజిల్ కోసం బారులు తీరడం చాలా బాధాకర విషయం, డీజిల్ అన్ని బస్సులలోనింపుకున్న సరే ఇంక మూడు గంటల పైగా సమయం పడుతుందని డ్రైవర్ సోదరులు వారి బాధను తెలియజేశారు, ఇలా వారి డ్యూటీ సమయాన్ని మించి 6 నుండి 7 గంటలు పని చేస్తున్నారు, వారికి ఓటి రూపంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు, తెరాస పార్టీ రెండోసారి అధికారం లోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఏ సమస్యలు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు

also read :-భట్టి ’మహా పాదయాత్ర‘

ఇప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసినిర్వీర్యం చేయాలని చూస్తున్నారుఅలాగే ఆర్టీసీ యూనియన్ లేకుండా చేశారు, యూనియన్లు ఉంటే యూనియన్ నాయకులు ఇలాంటి సమస్యల మీద పోరాటం చేస్తారని యూనియన్ లు లేకుండా చేశారు, రవాణా శాఖ మంత్రిగా ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం, కెసిఆర్, కేటీఆర్ మెప్పుకోసం హడావిడిగా కొత్త బస్టాండ్ నిర్మించి ప్రారంభించారు, నిర్మించిన కొన్ని రోజులకే చిన్న చిన్న వర్షాలకుపైకప్పు కురవడం, ప్రహరీ గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి,

మంత్రి ఇప్పటికైనా ఈ సమస్యలపై దృష్టి పెట్టి డిపోలోపనిచేస్తున్న ఆర్టీసీకార్మికులు అందరికీ కనీస మౌలిక సదుపాయాలు అందించాలని కోరారుప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని రానున్న కాలంలో ప్రజలు ఈ మంత్రికి తెరాస ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెప్తారని నిప్పులు చెరి ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య, నగర కాంగ్రెస్ నాయకులు ఏలూరు రవి, బాణాల లక్ష్మణ్, వసీం, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*