Telugu News

పేదవారి భూములు లాక్కుంటే యుద్ధమే

- కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్

0

పేదవారి భూములు లాక్కుంటే యుద్ధమే
— కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్
(కూసుమంచి-విజయంన్యూస్)
ప్రభుత్వం పేదవారి ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకొవటం సిగ్గుచేటు అని దాన్ని వెంటనే విరమించుకోవాలని జిల్లా కిసాన్ కాంగ్రెసు అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ అన్నారు. శనివారం కూసుమంచి మండలం గురువాయిగూడెంలో జరిగిన విలేకరుల సమావేశంలో శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి భూముల్ని సాగు చేసుకుంటూ జీవిస్తుంటే దౌర్జన్యంగా లాక్కోవడం అన్యాయమని,అలాగే భూములు లాక్కుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతో యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.

also read :-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

వేసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్రప్రభుత్వం కొన్న తర్వాత కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయాలని ముందే యాసంగి ధాన్యం వేయొద్దని కెసిఆర్ ముందే బీజేపీ ఆజ్ఞలను అమలు చేశాడని ఇప్పుడు డ్రామాలాడుతున్నాడనికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాపి రైతుకు అన్యాయం జరక్కుండా చూడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను, బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, బస్ ఛార్జీలను నెలలో ఇప్పటికే మూడు సార్లు పెంచారని ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటుపరం చేయడం కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు మొత్తం పబ్బులు లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు నడుపుకుంటూ పేదవారిని మధ్యతరగతి వారిని విపరీతంగా దోచుకుంటున్నారని వారిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఏమీ పట్టించుకోకుండా ఫాంహౌజ్ కే పరిమితమై రాష్ట్ర పాలన గాలికొదిలేశాడని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మెలుకోకపోతే, ప్రజలు బొందపెట్టేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.

also read :-ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకే మన ఊరు మన బడి.. మంత్రి పువ్వాడ..

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి రమేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు మూడు ముంతల గంగరాజు యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మట్టే గురవయ్య, మండల కిసాన్ కాంగ్రెస్ నాయకులు గార్ల రాజశేఖర్, గురువాయిగూడెం ఎంపీటీసీ బానోతు సుజాత సత్యం, గుర్వాయిగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి రాంరెడ్డి, సారా బుడ్ల కృష్ణారెడ్డి, బొజ్జ గోవిందరెడ్డి, బాణం ప్రభాకర్, బానోతు రాంచందర్, ములుగురు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.