Telugu News

ఖమ్మం డిపో ఉద్యోగులకు అవార్డుల పంట

ఆర్టీసీలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు

0

ఖమ్మం డిపో ఉద్యోగులకు అవార్డుల పంట

== ఆర్టీసీలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు

== ప్రగతిచక్రం అవార్డ్స్-2021 ప్రశంసాపత్రాలు

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-

ఆర్టీసీ ఉద్యోగులు తమ ఉద్యోగ నిర్వహణలో స్ఫూర్తిదాయకమైన అత్యుత్తమ సేవలందిస్తూ,సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా తమ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను గుర్తించి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్రగతి చక్రం అవార్డ్స్-2021,ప్రశంసా పత్రాలు అందించి ప్రతిభకు పట్టాభిషేకం చేసినట్లుగా ఆత్మీయంగా అభినందించారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని తార్నాక వైద్యశాలలో ఏర్పాటుచేసిన ప్రగతిచక్రం అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి సజ్జనార్,సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం నాయక్,మునిశేఖర్ ల చేతులమీదుగా పలువురు ఖమ్మండిపో ఉద్యోగులు ప్రగతిచక్రం అవార్డ్స్ 2021,ప్రశంసాపత్రాలు అందుకున్నారు.ప్రశంసా పత్రంలో “ఉత్తమ ఉద్యోగుల సేవలకు కు అభినందన చందనం.సంస్థకు మీరు అందిస్తున్న సమున్నత సేవలకు శుభాభినందనం.

also read :-ఆర్టీసీ ఆస్పత్రికి మంత్రి అజయ్ వితరణ

సంస్థ కోసం,ప్రజా రవాణాలో మెరుగైన సేవల కోసం ధృఢ సంకల్పంతో మీరు వేస్తున్న అడుగు ఇతరులకు స్ఫూర్తిదాయకం కాగలదు. సంస్థ ప్రగతిని సాధించే దిశలో చేస్తున్న ప్రయత్నంలో మీరూ భాగస్వాములైనందుకు గానూ ప్రత్యేకంగా మీకు ‘ప్రగతి చక్రం అవార్డు’ను బహుకరిస్తున్నాము.మీ కృషిని ఎల్లవేళలా ఇదేరకంగా కొనసాగిస్తూ,ఉద్యోగ విధానంలో నవ్యతను నిభిడీకృతం చేయాలని ఆకాంక్షిస్తూ ప్రగతి చక్రం అవార్డు అందుకున్న సందర్భంగా మీకు మరో మారు శుభాకాంక్షలు.” అంటూ పేర్కొన్నారు.

ఉద్యోగులను ఆత్మీయంగా ప్రగతి చక్రం అవార్డుతోపాటు ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు. ఖమ్మం డిపో నుండి ప్రగతి చక్రం అవార్డులు ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో ఖమ్మం డిపో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్)టి.స్వామి,ఆర్టీసీ కానిస్టేబుల్ అస్లాం భాషా, కంట్రోలర్ ఆకుతోట శ్రీనివాసరావు,మెకానిక్ వి.శివ మారుతి,కండక్టర్ జి.గోవిందమ్మ,డ్రైవర్లు టి.రమేష్,ఎన్.వి.నారాయణ,ఎం.హనుమయ్య ఉన్నారు. తమ అత్యుత్తమ సేవలతో అన్ని విభాగాల లో స్ఫూర్తిదాయకమైన రాష్ట్ర స్థాయి అవార్డులను ఖమ్మండిపోకు సాధించిన ప్రగతిచక్రం అవార్డు గ్రహీతలకు ఆర్టీసీ అధికారులు,సూపర్ వైజర్లు తోటి ఉద్యోగులు అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు.