Telugu News

మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

= సాయిగణేష్ ఆత్మహత్య వ్యవహారంలో హైకోర్టు సీరియస్

0

మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

== సాయిగణేష్ ఆత్మహత్య వ్యవహారంలో హైకోర్టు సీరియస్

== కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు త్రీటౌన్ సీఐ, ఎస్ఐలకు నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం

== రెండు వారాల్లో స్పందించాలని, విచారణను అదే రెండువారాలకు వాయిదా వేసిన హైకోర్టు

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
సాయిగణేష్ ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ విషయంపై వదలకుండా ఆందోళనలు, విమ్మర్శలు చేస్తుండగా, బీజేపీ పార్టీ జాతీయ స్థాయి నాయకులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రోజుకోకరు చొప్పను ఖమ్మం జిల్లాకు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి నేలకొంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. కాగా గవర్నర్ ఈ అంశంపై ద్రుష్టి సారించి ప్రభుత్వాన్ని నివేదక ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సంచలనంగా మారిన తరుణంలో మరో వైపు న్యాయస్థానం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. సాయిగణేష్ ఆత్మహత్య విషయంపై హైకోర్టులో బీజేపీ నాయకులు పిటీషన్ వేయగా లంచ్ మోషన్ గా హైకోర్టు విచారణ చేపట్టింది.

also read;-విద్యార్థులతో కలిసి బోంచేసిన  కలెక్టర్

దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిరియస్ అయిన హైకోర్టు వారందరికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇటీవలే బీజేపీ మజ్దూరియూనిన్ జిల్లా అధ్యక్షుడు సాయిగణేష్ చౌదరి పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాఠకులకు తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ పార్టీ రోజుకో కార్యక్రమం చొప్పున నిరసన కార్యక్రమాలు చేపట్టడం, కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు పరామర్శించడం, ఆందోళనలు చేయడం జరుగుతూనే ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి కేంద్రమంత్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఎంపీ సోయం బాబురావు పరామర్శించగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఎలాంటి సంఘటన జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

also read;-టీఆర్పీ రేసులో దూసుకపోతున్న‘‘అఖండ’’

అయితే ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. అధికారటీఆర్ఎస్ నేతల ప్రోత్సహంతో పోలీసులు తనపై కేసులు పెట్టి వేదిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాని సాయిగణేష్ మరణవాగ్ములం ఇవ్వడంతో అందుకు దారి తీసిన కారణాలను వెలికతీసేందుకు కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ నేతలు శుక్రవారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా వెంటనే స్పందించిన హైకోర్టు లంచ్ మోషన్ కిందా విచారణ చేపట్టింది. న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు సాయిగణేష్ అంశంపై సీరియస్ గా పరిగణించింది. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు త్రీటౌన్, టూటౌన్ సీఐ, ఎస్ఐలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాగా రెండు వారాల్లో పూర్తి వివరాలను హైకోర్టుకు సమాధానమివ్వాలని ఆదేశించింది. దీంతో పాటు ఈ కేసును హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఖమ్మం జిల్లా సంఘటన సంచలనమైంది. రాబోయే రోజుల్లో ఇంకేన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.