Telugu News

ఎస్ఐ దారం సురేష్ నీ సన్మానించిన 1104 బిటిపిఎస్ రీజినల్ ప్రెసిడెంట్ భూక్య హెంలాల్ నాయక్

ప్రజా సేవకుడు ఎస్ఐ సురేష్  

0

ప్రజా సేవకుడు ఎస్ఐ సురేష్  

? ఎస్ఐ దారం సురేష్ నీ సన్మానించిన 1104 బిటిపిఎస్ రీజినల్ ప్రెసిడెంట్ భూక్య హెంలాల్ నాయక్
?మన తెలంగాణ విలేఖరి తేజావత్ గాంధీ

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )

బూర్గంపాడు మండలంలో నూతన ఎస్ఐ గా ఛార్జ్ చేపట్టిన దారం సురేష్ నీ 1104 యూనియన్ బిటిపిఎస్ రీజినల్ ప్రెసిడెంట్ భూక్య హెంలాల్ నాయక్,మన తెలంగాణ విలేఖరి తేజావత్ గాంధీ యూనియన్ నాయకులు,వారి కార్యకర్తలు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవే పరమావధిగా పనిచేస్తున్న ప్రజా సేవకుడు అని కొనియాడారు.బూర్గంపాడు ఎస్ఐ గా విధులు మంచిగా నిర్వహించాలని వారికి శాల్వతో, పూల దండలు తో శుభాకాంక్షలు తెల్పినారు.

also read :-టిఆర్ఎస్ దౌర్జన్యాలపై సీబీఐ విచారణ జరపాలి.

మీరు నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అని, నేటి తరానికి మీరు స్ఫూర్తి దాయకం కావాలి అని అన్నారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ బూర్గంపాడు మండలంలోని పని చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని, అందులోనూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే వారికి పని చేయడం మంచిది అని, అదృష్ణగా భావిస్తున్నానని డ్యూటీ నా దైవం అని,పాలన పరంగా దానిలో భాగంగా బూర్గంపాడు పట్టణ ప్రజలు కానీ అన్ని విషయల్లోనూ, నా వంతు సాయం చేస్తూ కంటికి రెప్పల ప్రజల కొరకు ప్రజా క్షేమం కొరకు కృషి చెస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్యకర్తలు పాలుగొన్నారు.