Telugu News

గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి ఇంటింట ప్రదర్శన

స్థానిక 8 వ డివిజన్ వైయస్సార్ కాలనీ లో ప్రదర్శన

0

గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి ఇంటింట ప్రదర్శన

== స్థానిక 8 వ డివిజన్ వైయస్సార్ కాలనీ లో ప్రదర్శన

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి నిత్యావసర వస్తు ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా సంఘీభావం తెలుపుతూ ఖమ్మం నగరంలో స్థానిక 8 వ డివిజన్ లో ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంట గ్యాస్ సిలిండర్లకు పూలదండలు వేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జావిద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పోరాటానికి అండగా ఉంటామని వెల్లడించారు.

also read:-అచ్చే దిన్ కాదు సచ్చె దిన్

కేంద్రంలో బిజెపి దేశం అభవృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అలాగే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచే విధంగా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారాని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరల నియంత్రణ చట్టాన్ని కార్పొరేట్ శక్తుల కోసం మోడీ ప్రభుత్వం రద్దు చేసి, తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులు నిత్యావసర వస్తువులను గోదాముల్లో దాచి కృత్రిమ కొరత సృష్టించి విపరీతంగా ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.పెట్రోల్ ,డీజిల్,వంట గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని లూటీ చేస్తుందని ఐదు రాష్ట్రాల ఎన్నికాలయందు దాదాపు ఐదు నెలలు పెంచకుండా అపి అంతర్జాతీయ సంక్షోభం అని సాకులు చెబుతూ ధరలు పెంచి రాజకీయ లబ్ది పొంది ప్రజలపై భారం వేస్తూ అధికారం చెలాయిస్తుందని మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశ ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు

also read :-ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

ధరల నియంత్రణ చేయలేకపోతే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ వెంటనే దిగిపోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమాయత్తం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతకాని తనాన్ని చూపించి గద్దె దిగి అంతవరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమిస్తరని. తెలుపుతూ ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ లకు దండలు వేసి మహిళలు మరియు కాంగ్రెస్ నాయకులు డప్పులపై ప్లేట్ల పైన శబ్దం చేస్తూ చావు డప్పు వాయించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల, దుద్దుకూరు వెంకటేశ్వర్లు ,సైదులు నాయక్ నిరంజన్, పల్లె బోయిన భారతి రాఫిదా బేగం, బాణాల లక్ష్మణ్, మిక్కిలినేని నరేంద్ర చౌదరి, శంకర్ నాయక్ ,గజల్ వెంకన్న, బి హెచ్ రబ్బాని, ఏలూరి రవికుమార్ పల్లె పోయిన చంద్రం స్థానిక మహిళలందరూ ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.