Telugu News

అక్రమ లే-అవుట్ల సంగతేంటి..?

%% ఖమ్మం రూరల్ మండలాధికారులను ప్రశ్నించిన కలెక్టర్

0

అక్రమ లే-అవుట్ల సంగతేంటి..?
%% ఖమ్మం రూరల్ మండలాధికారులను ప్రశ్నించిన కలెక్టర్
%% వెంచర్లను పరిశీలించి, అధికారులపై ఆగ్రహం
%% నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశం
(ఖమ్మంరూరల్,కూసుమంచి-విజయంన్యూస్)
ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న వెంచర్ల సంగతేంటని..? అక్రమ లే-అవుట్ ల నిర్మాణంలో ఉన్నప్పటికి చర్యలు ఎందుకు తీసుకోలేదని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ లే-అవుట్ నియంత్రణలో నిర్లక్ష్యానికి బాధ్యులైన మండల స్థాయి అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండల పర్యటన సందర్భంగా గుర్రాలపాడు వద్ద అక్రమ లే – అవుట్లను కలెక్టర్ ఆకస్మికంగా తణిఖీ చేశారు. పది ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లే-అవుట్ ప్రాంతాన్ని కలెక్టర్ తణిఖీ చేసి రిజిస్ట్రేషన్ జరుగకుండా అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయని, మండల స్థాయి అధికారులు ఇట్టి లే-అవుట్ పై తగు చర్యలు తీసుకోకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

also read :-వనమా రాఘవను అరెస్ట్ చేయాలి : భట్టి

ఇట్టి చర్యలకు బాధ్యులైన మండల స్థాయి అధికారుల నుండి వివరణ కోరి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వెంచర్లను విరిగా తనిఖీలు చేయాలని, అక్రమ వెంచర్లపై, అక్రమ లేఅవుట్ లపై చర్యలు తీసుకోవాలని అనేక దఫాలుగా చెప్పానని, కానీ నామాటే పెడచెవిన పెట్టారని ఆగ్రహించారు. గ్రీన్ బెల్ట్ లేకుండా అనుమతులు లేకుండా, పంచాయతీకి భూమిని కేటాయించకుండా లేఆవుట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పనులు చేస్తున్నారా..? లేదంటే..? అంటూ మండలాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఎన్ని వెంచర్లు ఉన్నాయి.. ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో తక్షణమే రిపోర్టు ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.అప్పారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, ఇంచార్జ్ తహశీల్దార్ కరుణశ్రీ, ఎం.పి.డి.ఓ శ్రీనివాసరావు, ఎం.పి.ఓ, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.