Telugu News

ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్, అజయ్

హాజరైన ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతామధు, బాలసాని

0

ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్, అజయ్
== హాజరైన ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతామధు, బాలసాని
(ఖమ్మం,వైరా-విజయంన్యూస్)
వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించబడిన ఇండోర్ స్టేడియం, వైరా రిజర్వాయర్ నందు బోటింగ్ ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ఎక్సైజ్, పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

also read :-మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఖమ్మంలో ఘన స్వాగతం

ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఖమ్మంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతామధుసూధన్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారందరు వైరాకు వెళ్లగా అక్కడ వైరా ఎమ్మెల్యే లావుడియా రాములునాయక్, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.

also read;-వైరాలో మంత్రికి శ్రీనివాస్ గౌడ్ కు నిరసన సెగ

అనంతరం వైరా పట్టణంలో నూతనంగా నిర్మాణం చేసిన ఇండోర్ స్టేడియంను మంత్రులు ప్రారంభించారు. అనంతరం వైరా చెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్ సౌకర్యాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మునిసిపల్ చైర్మన్ సూతకని జైపాల్ ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఐదు మండలాల ముఖ్య నాయకులు మండల అధ్యక్షులు ఎంపీపీ, జడ్పిటిసిలు, ప్రభుత్వ గురుకుల సంక్షేమ పాఠశాల క్రీడాకార విద్యార్థినులు, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.