Telugu News

పెంచిన ఆయిల్,నిత్యవసర సరుకుల ధరలు, గ్యాస్, విద్యుత్,బస్సు చార్జీలను తగ్గించాలి,

అఖిలభారత రైతుకూలీ సంఘం(AIKMS) ఖమ్మం జిల్లా కమిటీ

0

పెంచిన ఆయిల్,నిత్యవసర సరుకుల ధరలు, గ్యాస్, విద్యుత్,బస్సు చార్జీలను తగ్గించాలి,

—వరి ధాన్యం కొనుగోలు చేయాలి

—అఖిలభారత రైతుకూలీ సంఘం(AIKMS) ఖమ్మం జిల్లా కమిటీ

(ఖమ్మం-విజయం న్యూస్);-

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ విద్యుత్,బస్సు చార్జీలను తగ్గించాలని కోరుతూ, రైతాంగం పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతుకూలీ సంఘం(AIKMS) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రం మయూరి సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలభారత రైతుకూలీ సంఘం(AIKMS) ఖమ్మం జిల్లా అద్యక్షకార్యదర్శులు బజ్జూరి వెంకటరామిరెడ్డి, వై.ప్రకాష్ లు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో వున్న BJP ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ఆయిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారన్నారు.

also read :-తలసేమియా చిన్నారులకు అండగా ఉంటా.. మంత్రి పువ్వాడ.

రోజురోజుకీ నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ప్రజల జీవనం స్తంభించిపోతుందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి, గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచి, బస్సు చార్జీలు పెంచి ప్రజలను దోచి కార్పోరేటు కంపెనీలకు కట్ట పెడుతున్నారన్నారు. ప్రజా సంపదను అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నాడన్నారు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం,ప్రజలు తిరుగుబాటుకి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, ఆయిల్ ధరలు, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయుటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వీడి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

also read :-వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ దొంగ ధర్నాలు
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, అఖిలభారత రైతుకూలీ సంఘం(AIKMS) జిల్లా నాయకులు షేక్ ఖాసీం, కేతబోయిన రాధాకృష్ణ, తూము పిచ్చయ్య, చెరుకుపల్లి వీరయ్య,అచ్చి ఉప్పలయ్య, పోలెపొంగు నాగయ్య, బుర్ర సైదులు, చెరుకుపల్లి భద్రయ్య, మహంకాళి ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు. నాయకులు కోలా లక్ష్మీనారాయణ, మోహన్ రావు, ఉమాశంకర్
విప్లవాభివందనాలతో.