ఇది రైతు ప్రభుత్వం
== రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
== కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
(కూసుమంచి-విజయంన్యూస్);-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతులను కాపాడుకుని, వారికి అండగా ఉండే ప్రభుత్వమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. గురువారం కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. అలాగే నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
also read :-హోంవర్క్ చేయలేదా?.. వేపరసం తాగండి !
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కేంద్రప్రభుత్వం తీరని ఆన్యాయం చేస్తోందన్నారు. రైతుల పండించిన పంటను కొనుగోలు చేయాలని రైతులు, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేసిన, డీల్లీలో ఆందోళనలు చేసిన ఫలితం లేకుండా పోయిందని, కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని, వారికి రైతుల తరుపున ధన్యవాదాలు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, సోసైటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరైయ్యారు.