Telugu News

జితేందర్ రెడ్డి సేవలు మరవలేనివి

రాజుపేటలో ప్రథమవర్థంతి వేడుకల్లో హాజరైన ఎంపీ నామా,

0

జితేందర్ రెడ్డి సేవలు మరవలేనివి

== రాజుపేటలో ప్రథమవర్థంతి వేడుకల్లో హాజరైన ఎంపీ నామా,

 

===ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యేలు సండ్ర, కందాళ

(కూసుమంచి-విజయం న్యూస్);-

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సోదరుడు జితేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గానికి చేసిన సేవలు మరవలేనివని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్వగ్రామం కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో జితేందర్ రెడ్డి ప్రథమ వర్థంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కందాళ ఉపేందర్ రెడ్డితో పాటు ఎంపీ నామానాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతామధుసూధన్ రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ సర్పంచ్ కందాళ సురేందర్ రెడ్డి హాజరైయ్యారు.

also read;-ఓట్లు వేయించుకోవడం.. ఫామ్ హౌజ్లో పండుడే

జితేందర్ రెడ్డి స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అలాగే ఎంపీపీలు బానోతు శ్రీనివాస్ నాయక్, బోడా మంగిలాల్, బెల్లం ఉమా, జడ్పీవైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, జడ్పీటీసీలు ప్రసాద్, ఇంటూరి బేబి, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ బానోతు రాంకుమార్ నాయక్, సోసైటీల చైర్మన్లు వాసంశెట్టి వెంకటేశ్వర్లు, చంద్రారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐ.శేఖర్, మండల పార్టీ అధ్యక్షులు వేముల వీరయ్య, బెల్లం వేణు, ఉన్నంబ్రహ్మయ్య, బాషబోయిన వీరన్న, సర్పంచ్ వాసంశెట్టి అరుణ, ఎంపీటీసీ మోదుగు వీరభద్రం తదితరులు హాజరైయ్యారు.