Telugu News

కోటి ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దే..!

రైతుకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సే

0

కోటి ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దే..!

== రైతుకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సే

== అన్నదాతలపై వివక్ష చూపుతున్న కేంద్రానికి పతనం తప్పదు

== నేలకొండపల్లి మండలం రైతు నిరసన దీక్షలో మాజీ ఎంపీ పొంగులేటి

(నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్);-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి రైతన్నలకు అండగా నిలిచిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి , సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతు నిరసన దీక్ష తెరాస ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించారు. ఇందులో భాగంగా నేలకొండపల్లి మండలంలో తెరాస పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన రైతు నిరసన దీక్షలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అధికారం కోసమో… పదవులకోసమో అన్నదాతల సంక్షేమాన్ని విస్మరిస్తే రాబోవు రోజుల్లో పతనం తప్పదని హెచ్చరించారు.

also read;-తెలంగాణలో వరి పండించే రైతులపై కేంద్రం వివక్ష వీడాలి

ఎన్నికల సమయంలో రైతన్నల చుట్టూ తిరిగి  అండదండలతో అందలం ఎక్కాక  బాగోగులు పట్టించకోకపోవడం దారుణమైన విషయమన్నారు. తమకు అనుకూలంగా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోని రైతులకు ఓ న్యాయం… అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓ న్యాయం చేయడం సిగ్గుచేటన్నారు. ఇదే ద్వంద్వ నీతిని పాటిస్తే తెలంగాణ రైతులతో పాటు ప్రజానీక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

also read;-ఢిల్లీపై దండయాత్ర

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ వజ్యా రమ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబంటి శ్రీనివాసరావు, నేలకొండపల్లి సొసైటీ చైర్మన్ కోటి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మోహన్ రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ శాఖమూరి సతీష్, సర్పంచు సుధాకర్, అనగాని అనిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బచ్చలకూర శ్రీనివాసరావు, రాయపూడి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, బొలుసు రవి, వాకా శ్రీనాథ్, జాన్ రెడ్డి, కనక ప్రసాద్, కొణిజర్ల ఎంపీపీ గోసుమధు, దేవరపల్లి అనంతరెడ్డి, యడవల్లి సైదులు, కాసాని నాగేశ్వరరావు, పెద్దపాక వెంకటేశ్వర్లు, మరికంటి రేణుబాబు తదితరులు పాల్గొన్నారు.