Telugu News

కేసీఆర్ అసలు మనిషేనా..?

= కష్టాలను చూడలేని వికలాంగుడు కేసీఆర్

0

కేసీఆర్ అసలు మనిషేనా..?

== కష్టాలను చూడలేని వికలాంగుడు కేసీఆర్

== చెవులుండి కూడా జనం గోసను వినడం లేదు

== తెలంగాణలో తాలిబాన్ తరహాలో ప్రభుత్వం నడుస్తోంది

== సీఎం కేసీఆర్ పై మండిపడిన వైఎస్ షర్మిళ

== కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
సీఎం కేసీఆర్ పేదల బాదలు అర్థం చేసుకోవడం లేదని, చెవులున్న వినపడనట్లుగా, కండ్లున్న కనిపించనట్లుగా ప్రవర్తిస్తున్నాడని, ఆసలు ఆయన మనిషేనా..? అంటూ వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఆరోపించారు. ఆదివారంకొత్తగూడెం నియోజక వర్గం కోమటిపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల మాట – ముచ్చట కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడారు. వికలాంగుల సమస్య లను ఉద్యేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిళ రాష్ట్రం లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, వికలాంగుల గోస కూడా ప్రభుత్వం కి వినపడటం లేదని ఆరోపించారు. కళ్ళు ఉండి కష్టాలు చూడలేని కేసీఆర్ వికలాంగుడు, చెవులు ఉండి వినలేని వికలాంగుడు కేసీఆర్,ఆయనలో అసలు మానవత్వం ఉందా అన్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు.

also read :-ఖమ్మంలో ఉత్కంఠ విమర్శలు.. ప్రతి విమర్శలు

కేసీఆర్ అసలు మనిషే నా…మనిషి జాబితాలోకి వస్తాడా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ మృగం లా వ్యవహరిస్తున్నాడని, కేసీఆర్ కేవలం ఆయన కోసమే…ఆయన కుటుంభం కోసమే..ఆయన పార్టీ కోసమే నడుపుతున్న ఈ ప్రభుత్వమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే ఈ నియోజక వర్గం ఎమ్మెల్యే టీఆరెఎస్ లో చేరాడని, అయన కొడుకు అరాచకాలు అన్ని ఇన్ని కావు అని చెప్తున్నారని అన్నారు. నియోజక వర్గం లో తిరుగుతుంటే ఎమ్మెల్యే కొడుకు అరాచకాలు చెప్తున్నారని, ఇదేక్కడి చోద్యమో అర్థం కావడం లేదన్నారు. అధికార పార్టీ నేతల అరాచకాలు భరించ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరిపంచారు.

ఇంత జరుగుతున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదేందుకని ప్రశ్నించారు. పోలీసులను పనోల్లుగా వాడుకుంటున్నారని, అధికార పార్టీ వారి కోసమే పని చేయించు కుంటున్నారని ఆరోపించారు. ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్… తాలిబాన్ ప్రభుత్వంలా ఉందని దుయ్యబట్టారు. మనం ఎలాంటి ప్రభుత్వం లో బ్రతుకు తున్నామో ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణ గా మారిందని, ఎన్నికలు వస్తుంటే గారడి మాటలు..దొంగ హామీలు ఇస్తుంటారని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దళిత బందు అని కొత్త మోసం మొదలు పెట్టారని ఆరోపించారు.

also read :-సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే..

కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనుకుంటే టీఆరెఎస్ లో చేరిందని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షం లేక వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానని తెలిపారు. ఈ గడ్డకు సేవ చేసే హక్కు నాకు లేదా..? వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ ఆశీర్వదించండని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఎంత కావాలి అంతే అన్ని నిధులు విడుదల చేస్తానని హామినిచ్చారు. వికలాంగుల బ్రతుకు బంగారం చేస్తానని హామినిచ్చారు.
==వికలాంగు కార్పోరేషన్ ఏది..? : సతీష్ గుండపనేని
పాలకులు ప్రగతి భవన్ కే పరిమితం అయ్యారని, మా వికలాంగుల సంఖ్య 20 లక్షలు గా ఉందని, ఇల్లు,కారు ఉందని పెన్షన్ కట్ చేస్తున్నారని తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి సతీష్ గుండపనేని ప్రశ్నించారు. గతం లో వికలాంగులకు ఒక కార్పొరేషన్ ఉండేదని, ఇప్పుడు నాలుగు శాఖల్లో విలీనం చేశారని, ఇప్పుడు పనులు కావాలి అంటే నాలుగు శాఖలు తిరగలని అన్నారు. సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్ చేసే సంక్షేమం ఇదేనా అని ప్రశ్నించారు. మా దివ్యంగుల భాదలు ఎన్నో ఉంటాయని, వికలాంగుల మద్దతు ఉందని చెప్పిన కేసీఆర్..మాకు మాత్రం మద్దతుగా లేడని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో గుడ్డి వాటికి కుక్ పోస్ట్ ఇస్తే ఎలా చేస్తాం, దలితబందు మాదిరిగా దివ్యాంగులకు దివ్యాంగ బందు ఇవ్వాలని అన్నారు. నిరుద్యోగులు ఇంటి ముందు ఏడిస్తే…ఉద్యోగులు ఇంటి వెనుక ఏడుస్తున్నారని తెలిపారు.