Telugu News

కేసీఆర్ పాలన ప్రజల కోసం కాదు.. నేతల కోసం

రైతులంటే కేసీఆర్ కేందుకు చిన్నచూపు

0

కేసీఆర్ పాలన ప్రజల కోసం కాదు.. నేతల కోసం

== రైతులంటే కేసీఆర్ కేందుకు చిన్నచూపు

== ఆత్మహత్యలు పెరుగుతున్న ఈసంత పాపమనిపించదా..?

== కౌలు రైతులను గాలికి వదిలేశారు

 

== పంటపండించేది అసలైన కౌలు రైతు

==కౌలు రైతులకు రుణాలిచ్చి అదుకున్న ఘనత రాజన్నదే

== వనమా రాఘవేంద్ర బాధితులు కుప్పలుతెప్పలుగా ఉన్నారు

== తండ్రి ప్రోద్భలంతోనే వనమా రాఘవ తప్పుడు పనులు

== ఎమ్మెల్యే వనమాను భర్తరఫ్ చేయాలి

== రైతు దీక్షలో ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ షర్మిళ

(ఖమ్మం  -విజయం న్యూస్);-
కేసీఆర్ పాలన ప్రజల కోసం కాదు.. నేతల కోసం, నేతలకు బుజాలు తడిపై కాంట్రాక్టర్ల కోసమేనని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో ఏ ఒక్క సామాన్యుడు సంతోషంగా లేడని, మనో వేదనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని షర్మిళ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గాను చేపట్టిన ప్రజాప్రస్తాన పాదయాత్ర భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం కొత్తగూడెం నియోజక వర్గం గరీబ్ పేట గ్రామం లో రైతు గోస ధర్నా లో పాల్గొన్న వైఎస్ షర్మిల మాట్లాడారు. తెలంగాణ లో రైతును మనిషిగా చూడటం లేదని, కనీసం గౌరవం కూడా లేదని ఆరోపించారు. రైతు కటపడితే పరామర్శించే దిక్కు కూడా లేదని, సీఎం దగ్గరకు వెల్తే కూడా పరిష్కరించరా…? అని ప్రశ్నించారు.

also read :-రేపు యాదాద్రికి మంత్రి పువ్వాడ అజయ్

సాయం చేయమని మొఖం మీద చెప్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కి కళ్ళు ఉండి కనిపించవని, చెవులు ఉండి వినిపించవని ఆరోపించారు. ఫామ్ హౌస్ లో బోగాలు అనుభవిస్తున్న సీఎం కేసీఆర్ చేసిన మోసం తో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అప్పులమీద అప్పులు..మిత్తి ల మీద మిత్తిలు కట్టలేక హత్మహత్యలు చేసుకుంటున్నారని, పంట నష్టం జరిగితే పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి రైతు బందు ఇస్తే ఉపయోగం ఎంటి..? అని ప్రశ్నించారు. ఒక చేత్తో రైతు బందు ఇచ్చి..మరో చేత్తో బ్యాంక్ ల పేరిట గుంజుకుంటున్నారని అన్నారు. భూమిలేని అతి పేద రైతు కౌలు రైతు, కౌలు రైతుకు వ్యవసాయం మాత్రమే తెలుసని ప్రభుత్వం నుంచి ఏవి ఇవ్వక పోయినా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు.

also read :-వైద్యులుండరు వైద్యం అందదు

కేసీఆర్ దృష్టిలో సంక్షేమం అంటే ఒక చేత్తో ఇవ్వడం …మరో చేత్తో తీసుకోవడమని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో ఏ పంట పండించినా పెట్టుబడి తక్కువ…రాబడి ఎక్కువ ఉండేదని, అందుకే వైఎస్ హయం లో వ్యవసాయం బంగారంలా ఉండేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండగా అనేవిధంగా మారిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలతో రెండు సార్లు రైతులు మోసపోయారని, ఇక మోసపోయింది చాలని అన్నారు. వాగ్దానం చేసిన హామీలను నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె దింపుడే తరువాయి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వాన్నం గా మారాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు పీక్కుతింటుంటే…ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లుల మోత మోగిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు… జనరల్ వార్డుల్లో కుక్కలు.. స్పెషల్ వార్డుల్లో పిల్లులు తీరుతున్నాయని ఆరోపించారు. డాక్టర్ ఉంటే నర్స్ ఉండడు..నర్స్ ఉంటే డాక్టర్ ఉండడని అన్నారు. కేసీఆర్ కి జబ్బు వేస్తే ఢిల్లీ కి పోతాడని, పేదలకు బాగా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి లకు పోవాలా..? అని ప్రశ్నించారు.

కొండంత రాగం తీసి ఏదో పాట పడినట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి అని దుయ్యబట్టారు. యాసంగి పంట ఎలా కొనరో అంటూ ఢిల్లీకి వెళ్లి ఉత్త చేత్తో తిరిగి వచ్చాడని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే వనమా కొడుకు అరాచకాలు ఎక్కువ అయ్యాయని, కంచె చేను మేస్తే ఇక ఎవరికీ చెప్పుకోవాలి అన్నట్లు ఉందని అన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రోద్బలంతోనే వనమా రాఘవ దాష్టికాలు ఎక్కువైయ్యాయని, అందుకే వనమా వెంకటేశ్వరరావు నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని సూచించారు. లేదంటే అసెంబ్లీ స్పీకర్ సుమోటోగా తీసుకుని అసెంబ్లీ నుంచి తప్పించాలని, ప్రభుత్వం వనమా వెంకటేశ్వరరావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన ప్రజల కోసం కాదు …టీఆర్ఎస్ నేతల కోసమని ఆరోపించారు.

also read :-పోడు రైతులకు పట్టాలేప్పుడిస్తారు..?

పోలీస్ లను వాళ్ళకోసం నియమించుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీస్ లను పనోల్లుగా వాడుకుంటున్నారని, వ్యవసాయ మంత్రి రైతుల ఆత్మహత్యల పై హేళన గా మాట్లాడుతుండటం హాస్యాస్పదమని అన్నారు. సినిమా టిక్కెట్లు తో పోల్చుతుంటే మరో ఎమ్మెల్సీ వరి కంకులతో కొట్టమని చెప్తారా..? అని ప్రశ్నించారు. రైతు అంటే అసలు ఈ ప్రభుత్వానికి.. ఈ టీఆరెఎస్ నేతలకు లెక్క ఉందా..? అని ప్రశ్నించారు. తెలంగాణ లో అసలు ప్రతిపక్షం లేక పోవడమే కేసీఆర్ ఆడింది ఆట..పాడింది పాట లా సాగుతుందన్నారు. అందుకే రైతుల పక్షాన నిలిచేందుకే మీ ముందుకు వచ్చానని, ప్రజలందరు వైఎస్ఆర్ టీపీని ఆశీర్వదిస్తే కచ్చితంగా రైతు రాజ్యం తీసుకోస్తానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గడుపల్లి కవిత, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.