Telugu News

అక్రమ వెంచర్లకు చెక్ పెట్టాలి: అదనపు కలెక్టర్

లే అవుట్ పర్మిషన్ తప్పనిసరి

0

అక్రమ వెంచర్లకు చెక్ పెట్టాలి: అదనపు కలెక్టర్:

లే అవుట్ పర్మిషన్ తప్పనిసరి

(ములుగు జిల్లా విజయం న్యూస్);

ములుగు గ్రామ పంచాయితీ సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటిములుగు గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ వెంచర్లు చెక్ పెట్టాలని అక్రమ కట్టడాలను నిలిపివేయాలని లేఅవుట్ పర్మిషన్ తప్పనిసరి అని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థలు అన్నారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ములుగు గ్రామం సర్పంచ్ వార్డు సభ్యులతో డి పి ఓ ఆర్ డి ఓ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

also read;-స్మార్ట్ కిడ్జ్ లో అంబరాన్నంటిన “హోళీ” సంబరాలు*

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ములుగు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమార్ లేఅవుట్ పర్మిషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ములుగు జిల్లా కేంద్రంలో ఇటీవల అక్రమ వెంచర్లు పై కంప్లీట్ వచ్చాయని అన్నారు. లే అవుట్ పర్మిషన్ లేకుండా నూతన ఇండ్లకు నిర్మాణం ఎలా చేస్తున్నారని పర్మిషన్ ఎలా ఇస్తున్నారని అధికారులు అడిగారు.వార్డ్ సభ్యులతో గ్రామ సర్పంచ్ కార్యదర్శి ఫీల్డ్ వెరిఫికేషన్ వెళ్లి రెవిన్యూ సిబ్బంది తో సర్వే రిపోర్ట్ సమర్పించాలన్నారు.గ్రామపంచాయతీ పాలకమండలి గ్రామసభ తీర్మానం ప్రకారం అక్రమ కన్స్ట్రక్షన్స్ జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రతి వార్డు లో వార్డు సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

ములుగు జంగాలపల్లి మల్లంపల్లి ఏరియాలో విపరీతమైన అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని పర్మిషన్ లేకుండా ఎలా జరుగుతున్నాయి సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని అన్నారు.లే అవుట్ అనుమతి చేసుకోకుండా అక్రమ కట్టడాలు జరుగుతుంటే నిర్లక్ష్యం తగదు అని సూచించారు.ప్రతి గ్రామ సభలో తీర్మానం జరిగిన ప్రతి మినిట్స్ రిపోర్టు నా దగ్గరికి రావాలని అన్నారు కన్స్ట్రక్షన్ జరుగుతున్న భూమి రెవిన్యూ అసైన్డ్ వాటి వివరాలు లు దస్తావేజులు పరిశీలించాలన్నారు అభివృద్ధిని అడ్డుకుంటే భవిష్యత్తులో పురపాలక సంస్థ ఏర్పాటుకు ఎలా సిఫారసు చేస్తారు అని అన్నారు.

also read;-గ‌త మూడేండ్ల‌లో రైల్వేల్లోని నియామ‌కాలెన్ని: నామా నాగేశ్వరరావు

లేఅవుట్ డెవలపర్స్ వస్తే వార్డు సభ్యులకు కనీస అవ్వగాహణ ఉండాలి పంచాయతీ సెక్రెటరీ లెటర్ రాసి భూములకు సంబంధించిన దస్తావేజులు పరిశీలించి పర్మిషన్ లకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.2019 నుండి వెలిసిన వెంచర్ల యొక్క వివరాలు లే అవుట్ పర్మిషన్ భవన నిర్మాణాలకు పర్మిషన్ సరైన దస్తావేజులు పరిశీలించిన తర్వాత ఇవ్వాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు.ప్రతి వార్డు సభ్యుడికి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి హక్కు ఉందని 2019 పంచాయతీ చట్టం ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు.అక్రమ నిర్మాణాలు జరిగితే ఊరుకోమని పోలీస్ శాఖ వారి సహాయంతో జెసిపి తో బుల్డోజర్ తో కూల్చివేస్తామని, ఫీల్డ్ మీదికి గ్రామ పంచాయతీ సెక్రెటరీ వార్డు సభ్యులు రెవిన్యూ విఆర్ఓ ఆర్ ఐ తప్పకుండా వెళ్లాలని ఆదేశించారు.

లేఅవుట్ పర్మిషన్ లేకుండా భవన నిర్మాణాలు జరిపితే 25000 పెనాల్టీ విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి కి ఆదేశించారు.నూతన భవన నిర్మాణానికి దరఖాస్తులు వచ్చిన 21 రోజుల్లో ఫీల్డ్ మీదికి వెళ్లి వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు.సమావేశంలో ములుగు వైకుంఠధామం ఈజీఎస్ ద్వారా నిర్మాణం జరుగుతుందని అన్నారు.త్వరలో లో ములుగు గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇల్లీగల్ లేఅవుట్ పై ఒక సమావేశం ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచిని ఆదేశించారు.అక్రమ కన్స్ట్రక్షన్స్ కి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంట్ పోల్ ఎలా ఇస్తున్నారు వాటి వివరాలు తెలపాలని అన్నారు.హనుమకొండ వరంగల్ వ్యక్తులు వచ్చి ఇక్కడ లేఅవుట్ వెంచర్లు చేయడం ద్వారా గ్రామ పంచాయతీకి 2.5 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు.

యూ ఎస్ ఎ లాంటి దేశాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు గొప్ప కార్యక్రమం లో సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఆరోగ్య శాఖ అధికారులకు సహకరించాలన్నారు.ప్రతి ఒక్కరికి వివరాలు సేకరించే ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహకరించాలని సూచించారు.హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ద్వారా పేద ప్రజల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా వారికి మెరుగైన వైద్య సహాయం చేయడానికి వీలు ఉంటుందని అందుకు పేద ప్రజలకు సేవ చేయాలని గ్రామపంచాయతీ పాలకమండలి కి ఆదేశించారు.పర్మిషన్ కి దరఖాస్తు చేసుకోవడం ఇలా అని వివరించారు.

also read;-శ్రీలంకపై టీమీండియా ఘన విజయం
లే అవుట్ ప్లాన్ 1 :500
రహదారులు చూపేపటం 1:1000
రహదారుల కనీస వెడల్పు 10 మీటర్లు
యజమాని మరియు అర్హత గల సర్వేతో స్వయంగా సంతకం చేయబడిన నిర్దేశిత రూపంలో హామీపత్రం.

యాజమాన్య పత్రం యొక్క కాఫీ.

తాకట్టు లేనట్టు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జారీ చేయబడిన ధ్రువీకరణ పత్రం.

భూమి కొలతల శాఖ సాయంతో సైట్ యొక్క ధ్రువీకరణ పత్రం.

Dtcp సూచించిన ఈ విధంగా పరిశీలన చార్జీలు చెల్లించిన రసీదుప్రస్తుతం సూచించినట్లు దరఖాస్తు చేయాల్సిన కాపీ వినియోగదారు నుండి
నివాస గరిష్ట వైశాల్యం 120 చదరపు మీటర్లు, కనీస పరిణామం 300 చదరపు మీటర్లు కనీసం 18 చదరపు మీటర్లు ఉండాలి 60 మీటర్ల వెడల్పు కంటే తక్కువ గల జాతీయ రహదారి తప్పనిసరి అని వివరించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ కె రమాదేవి, డి పి ఓ వెంకయ్య, డి ఎల్ పి ఓ దేవరాజ్ ములుగు గ్రామ సర్పంచ్ బి నిర్మల తాసిల్దార్ సత్యనారాయణ స్వామి ఎంపీడీవో శ్రీనివాస్, ఏం పి ఓ. హనుమంతు, గ్రామ సెక్రెటరీ కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.