Telugu News

ఖమ్మం రైతులు దేశానికే ఆదర్శం

== పంటల సాగులో ఖమ్మం రైతుల భళా

0

ఖమ్మం రైతులు దేశానికే ఆదర్శం

== పంటల సాగులో ఖమ్మం రైతుల భళా

== పంటల సాగుపై ఖమ్మం రైతులకు మంచి అవగాహణ ఉంది

== ఖమ్మం వైవిధ్యమైన పంటలు, ఆధునిక సాగుకు ప్రసిద్ది.

== అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే రంగమే వ్యవసాయరంగం

== రైతు బంధు అందించే ఏకైక ప్రభుత్వం మాదే

== రైతుబంధు కోసం రూ.50వేల కోట్లు విడుదల చేశాం

== 80వేల రైతు కుటుంబాలకు బీమా ఇచ్చాం

== స్పష్టం చేసిన వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి

== సాగు సన్నాహక సమావేశంలో స్పష్టం చేసిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

== రైతు పక్షపాతి సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-

ఖమ్మంజిల్లా రైతులు దేశానికే ఆదర్శనీయమని, పంటల సాగు పై సంపూర్ణ అవగాహణ కల్గిన రైతులు ఖమ్మం జిల్లా రైతులేనని, అందుకనే ఇక్కడ పంటలు అద్భుతంగా దిగుబడి వస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. ఖమ్మం SR గార్డెన్స్ నందు జరిగిన వానాకాలం-2022 సాగు సన్నాహక సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

also read;-వన దేవత లను దర్శించుకున్న ఛత్తీస్ ఘడ్ మాజీ మంత్రి

సాగుకు సంబంధించిన ప్రణాళికపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్లక్రితమే పాలమూరు – ఖమ్మం జిల్లాలకు పూర్తి తేడా కనిపించేదని, సమైక్యపాలనలో పచ్చని పాలమూరు వట్టిపోయిందన్నారు. రాష్ట్రం అంతా కరువొచ్చినా ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో సాధారణంగా కరువు రాదని అన్నారు. ఖమ్మం రైతులు ఇతర ప్రాంతాల రైతులకు ఆదర్శమని కొనియాడారు. సీజన్ కు తగ్గట్లుగా, డిమాండ్ కు తగ్గట్లుగా ఖమ్మం జిల్లా రైతులు పంటలను సాగు చేస్తారని అన్నారు. అందుకే ఖమ్మం జిల్లా నుంచి పంట దిగుబడి అధికంగా వస్తుందని, మార్కెట్ లు ఎప్పుడు నిండుగా కనిపిస్తాయని అన్నారు.

also read;-వనజీవి రామయ్యను పరామర్శించిన మంత్రులు

ఖమ్మం జిల్లాలో మిర్చితో పాటు పత్తి, మొక్కజొన్నలు, వరి పంటలు అధికంగా సాగు చేస్తుంటారని, మరి ముఖ్యంగా ఆ పంట, ఈ పంట అనేది లేకుండా ప్రతి ఒక్క పంటను సాగు చేసే జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అని అన్నారు.

== మార్కెట్ డిమాండ్ తగ్గట్లుగా పంటల సాగుపై రైతులకు అవగాహణ కల్పించాలి
మార్కెట్ డిమాండ్ ను బట్టి రైతులు పంటలు పండించేలా వ్యవసాయశాఖాధికారులు చొరవ చూపాలని, డిమాండ్ కు తగ్గట్లుగా పంటలను సాగులోకి తీసుకరావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఏఏ పంటలు పండించాలి..? ఎలాంటి విత్తనాలు..? ఎంతమోతాదు ఎరువులు వాడాలి ? అన్న విషయాలపై రైతులకు రైతువేదికల ద్వారా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. మన వ్యవసాయ రంగం ఇప్పుడిప్పుడే ఆధునీకరణ, యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నదని, ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన వ్యవసాయ ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదన్నారు. అత్యధిక శాతం జనాభాకు ఉపాధి కల్పించగలిగే రంగం వ్యవసాయ రంగమేనని, ఆ రంగాన్ని కాపాడేందుకు, బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం విషయంలో దూరదృష్టి లేదని దుయ్యబట్టారు.

also read;-వనజీవి రామయ్యను పరామర్శించిన మంత్రులు

ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళికతో తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నారని అన్నారు. రైతులకు నేరుగా రైతుబంధు పథకం కింద ఖాతాలలో రూ.50 వేల కోట్లు వేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. ఉచిత కరెంట్ కోసం రూ.10 వేల కోట్లు భరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఏడేళ్లలో రూ.3 లక్షల 75 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం బలోపేతానికి కృషి చేసిందని, మన పంటలలో ఉత్పాదకత భారీగా పెరగాల్సిన అవసరం ఎంతైన ఉన్నదన్నారు. రైతువేదికలలో 365 రోజులు అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రపంచంలోనే రైతు ఏ కారణం చేత మరణించినా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి భీమా ద్వారా రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని, తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది రైతు కుటుంబాలు రైతుభీమా ద్వారా లబ్దిపొందారని పేర్కొన్నారు.

also read;-నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

కానీ కొందరు విపక్ష నేతలు 80 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రచారం చేస్తుండటం బాధాకరమన్నారు. యాసంగి పంట నెల రోజులు ముందు కోతకు వచ్చేలా చూసుకుంటే ప్రకృతి నష్టాలు ఉండవని రైతులకు వివరిస్తే దానిని కొందరు విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. అయ్య సంపాదించిన ఆస్తులతో తెలంగాణల రాజకీయ పార్టీ పెట్టి పరాయి ప్రాంతాలను ఏలాలని ఆశిస్తున్న వారు ఇక్కడ సుద్దులు చెప్తున్నారని ఆరోపించారు. రైతుబంధు, రైతుభీమా, కరంటు, సాగునీళ్లు ఇచ్చిన మా రైతులకు ఏం చెప్పాలి అన్న విషయం మాకు తెలియదా..? అన్ని ప్రశ్నించారు. 60 ఏండ్లు అధికారం అనుభవించి రైతులకు ఏం చేయనోళ్లు ఈ రోజు రైతులకు ఏదో చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం కంట్రోలు బియ్యం కోసం తండ్లాడిన తెలంగాణ నేడు దేశానికి అన్నంపెట్టిన పంజాబ్ కు మించి వరి ధాన్యం ఉత్పత్తిని సాధించిందని పేర్కొన్నారు.

also read;-దిశ కమిటీ సమావేశంలో హాజరైన ఎంపీ నామా

తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేతగాక కేంద్రప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. తెలంగాణలో ఏదో చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ , బీజేపీలు ప్రస్తుతం తమ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో దమ్ముంటే అమలు చేసి చూపాలని సవాల్ చేశారు. రైతులు, రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలి .. వ్యవసాయ రంగ మార్పుకు కృషిచేయాలని సూచించారు. సహజసిద్ద ఎరువులు, రసాయనాల వినియోగం వైపు రైతులను ప్రోత్సహించాలని, రైతువేదికల ద్వారా అందించే పుస్తకాలను రైతులు క్షుణ్ణంగా చదివి అనుసరించాలని ఆదేశించారు. మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం ప్రపంచం ఎదురుచూసే రోజులు రావాలి .. అది త్వరలో ఆవిష్కృతమవుతుందని భావిస్తున్నానని అన్నారు. నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి జీవితం యువతరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసి ఐఎఎస్ సాధించారని, యువత పని మీద గౌరవం పెంచుకోవాలని, నామోషితనం వదులుకోవాలని కోరారు.

also read;-వదల మంత్రి..నిన్ను వదలా == పువ్వాడ అజయ్ జైలుకు పోవుడు ఖాయం

వ్యవసాయ రంగం భవిష్యత్ ను మారుస్తామని స్పష్టం చేశారు. ప్రకృతిని ప్రేమించలేనివాడు తల్లితండ్రులను ప్రేమించ లేడని తెలిపారు. వ్యవసాయం అంటే పంటలు పండించేది కాదు, సమాజాన్ని నిర్మించేది, సంస్కరించేది అని ఒక తత్వవేత్త అన్నారని, రైతులు తమ అవసరాల కోసం చెట్టు, పుట్ట, గొడ్డు, గోదా అమ్ముకున్న దుస్థితిని దగ్గరగా చూసి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిచామని అన్నారు.తెలంగాణ ఏర్పడే నాటికి 1.8 శాతం ఉన్న వ్యవసాయ వృద్దిరేటు నేడు 8.1 శాతానికి పెరిగిందని అన్నారు.
== వ్యవసాయం బాగుండాలంటే విస్తరణ జరగాలి : మంత్రి పువ్వాడ
వ్యవసాయ బాగుపడాలి అంటే వ్యవసాయ రంగంలో విస్తరణ జరగాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నూతన యాజమాన్య పద్దతులు, పంటలు వేయాల్సిన పద్దతులు, వాడాల్సిన ఎరువులు, రసాయనాలపై రైతులకు తెలియజెప్పాలన్నారు. వ్యవసాయ శాఖలో అన్ని పోస్టులు భర్తీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని బలోపేతం చేయమని వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏఓలను కోరిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయం అందరు గుర్తుంచుకోవాలని సూచించారు. రైతువేదికలను సద్వినియోగం చేసుకుని ఏఈఓలు రైతులను చైతన్యం చేయాలని, ఖమ్మం వ్యవసాయంలో ఉమ్మడి రాష్ట్రంలో , తెలంగాణ రాష్ట్రంలో ముందున్న జిల్లా .. పంటల వైవిద్యీకరణలో ఖమ్మం ముందున్నదని అన్నారు. దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ప్రతి రైతువేదికలో నిరంతరం కార్యక్రమాలు జరగాలని కోరారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని, రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని అన్నారు.

also read;-గోత్తికోయ మహిళ అనుమానాస్పద మృతి…..

పల్లా రాజేశ్వర్ రెడ్డి గత పాలకులు రైతులను,వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారని, కానీ తెలంగాణ ప్రభుత్వం హాయంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులను హక్కున చేర్చుకున్నామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. 2014 కు ముందు వ్యవసాయ శాఖను పట్టించుకున్న పరిస్థితి లేదని, 2014 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ శాఖలో ఖాళీలు భర్తీ చేశారని అన్నారు. వ్యవసాయ శాఖకు రైతులలో గౌరవం పెంచారని, రైతుబంధు సమితులకు ప్రోత్సాహం అందిస్తూ, వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో గుర్తింపు ఇస్తున్నామని అన్నారు.

also read;-విత్తన దుకాణాలు తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్.
వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి, పథకాలు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి కేసీఅర్ మాత్రమేనని స్పష్టం చేశారు. డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో 24 గంటల కరెంట్ లేదు .. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చారని దుయ్యబట్టారు. తెలంగాణ 24 గంటల కరంటుతో వెలగడం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు.

== 24గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దే : ఎంపీ నామా నాగేశ్వర్ రావు
దేశంలో రైతుల గురించి ఆలోచించింది కేసీఆర్ , తెలంగాణ ప్రభుత్వమేనని, సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుభీమా అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని ఖమ్మం ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు కొనియాడారు. దేశంలో ఎక్కడా 24 గంటల కరంటు అందుబాటులో లేదని, రైతుకు ఏం కావాలో కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు. రైతులు ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టిసారించాలని కోరారు.

also read;-ఖమ్మం కార్పొరేషన్ కు శుభవార్త
ఆయిల్ పామ్ సాగును ఉమ్మడి ఖమ్మంలో మరింత విస్తృతంగా సాగుచేయాలని, నూతన యాజమాన్య పద్దతులు, పంటలు వేయాల్సిన పద్దతులు, వాడాల్సిన ఎరువులు, రసాయనాలపై రైతులకు తెలియజెప్పాలని అన్నారు. వ్యవసాయ శాఖలో అన్ని పోస్టులు భర్తీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఖమ్మం ఎస్.ఆర్ గార్డెన్ లో ఖమ్మం – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వానాకాలం సాగు సన్నాహక సదస్సులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వి.పిగౌతమ్, అనుదీప్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు తాతామధు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లు వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు తదితరులు అన్నారు.