Telugu News

జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఖమ్మం ఎంపీ నామ

పలు శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటుగా పలు కుటుంబాలకు పరామర్శ

0

జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఖమ్మం ఎంపీ నామ

పలు శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటుగా పలు కుటుంబాలకు పరామర్శ

(ఖమ్మం విజయం న్యూస్ ):-

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు ఆదివారం నాడు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు అందులో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి, కూసుమంచి మండలాలు, ఖమ్మం రూరల్ మండలం లో వెంకటగిరి గ్రామంలో జరిగిన బుర్రా గురవయ్య కుమారుడు వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు అలానే గుదిమళ్ల గ్రామంలో పోతునుక రామయ్య నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గుర్రం జగన్మోహన్ రావు ఫంక్షన్ హాల్ నందు జరిగిన చాపల రామారావు, శ్యామల కుమారుడు వివాహానికి మరియు టి.సి.వి.ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన మద్ది చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి, రామలీల ఫంక్షన్ హాల్ నందు జరిగిన అంబాల వెంకట్రాములు కుమారుడి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు

also read :-డిచ్పల్లిలో ఘోర ప్రమాదం

మరియు వంశీకృష్ణ, అమ్మ ఫంక్షన్ హాల్స్ నందు జరిగిన శుభకార్యాల్లో ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమ, సుడా డైరెక్టర్ సంజీవ రెడ్డి, సర్పంచ్ దండా పుల్లయ్య, జిల్లా నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, వైరా మండల పార్టీ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు,మంకెన నాగేశ్వరరావు, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్, భార్గవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.