Telugu News

డ్యాన్స్ చేసిన ఖమ్మం పోలీస్ కమీషనర్

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ సంబురాలు

0

డ్యాన్స్ చేసిన ఖమ్మం పోలీస్ కమీషనర్
== పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ సంబురాలు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఆయన సామాన్యుడు కాదు.. జిల్లా పోలీస్ వ్యవస్థకే బాస్.. ఖమ్మం జిల్లా పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్.. ఆయన రెగ్యూలర్ సమయంలో చాలా హుందాగా కనిపిస్తారు.. ఆయన నడుస్తుంటేనే పులి నడుస్తున్నట్లు కనిపిస్తుంది.. కానీ హోలీ పండుగ రోజు మాత్రం చిన్నపిల్లాడైయ్యారు. అందరితో సమానంగా సందడి చేశారు. కేరింతలు చేస్తూ డ్యాన్స్ చేశారు. అందర్ని ఉత్సహపరిచారు. దీంతో తోటీ స్నేహితులు, ఉద్యోగులు కమీషనర్ తో కలిసిపోయి సంబురం చేశారు. రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కేరింతలు. ఆనందోత్సవాల మధ్య హోలి సంబురాలను ఘనంగా నిర్వహించారు.

also read;-కేటీఆర్ ఖమ్మం పర్యటనకు సర్వం సిద్ధం

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హోలీ వేడుకలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్, పోలీస్ సిబ్బందిపై రంగులను చల్లుతూ…ఆట, పాటలతో ఆనందాన్ని పంచుకుంటూ, నృత్యాలతో సందడి చేశారు. పోలీస్ కమిషనర్ హోలీ శుభాకాంక్షలతో ప్రారంభమైన సందడి వాతావరణం పోలీస్ బ్యాండ్ చప్పుళ్లతో హోరెత్తింది. ఆప్యాయత, అనురాగాలను పంచే హోలీ వేడుకల్లో కుటుంభీకుల మధ్య అన్యోన్యత, ఆందరూ ఆరోగ్యంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.

ఆనంతరం జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ ని కలసిన పోలీస్ కమిషనర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ గౌష్ అలమ్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , అడిషనల్ ఏఆర్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు భస్వారెడ్డి, ప్రసన్న కుమార్ , రామానుజం,విజయబాబు, ఆర్ఐ లు రవి, శ్రీనివాస్ , సాంబశివరావు , శ్రీశైలం, సీఐ లు చిట్టిబాబు , శ్రీధర్, సర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు.