ఖమ్మంలో.. తీగల వంతెనను పరిశీలించిన మంత్రి పువ్వాడ
– త్వరలో ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
(ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం నగరం లకారం ట్యాంక్ బండ్ నందు రూ.8.75 కోట్లతో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ తో కలిసి పరిశీలించారు.
ఆయా ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో బ్రిడ్జి ను సందర్శించారు.
also read :-గాంధేయ మార్గమే మా లక్ష్యం : బత్తుల సోమయ్య
220 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన బ్రిడ్జి ఖమ్మంకు మరో మణిహారంగా నిలువనుంది.
ఇప్పటికే ఖమ్మం నగరం పర్యాటక కేంద్రంగా నిలిచింది. లాకరం టాంక్ బండ్ లో ప్రస్తుతం మ్యూజికల్ ఫౌంటైన్, వాకర్స్ ట్రాక్, ఓపెన్ జిం, 56-రకాల స్టాల్స్ తో ఈట్ స్ట్రీట్, బోటింగ్, స్పీడ్ బోట్, Walker’s ప్యారడైజ్, సైక్లింగ్ రోప్, మిని పార్క్ తో ఖమ్మం నగర ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని కల్పిస్తుంది.
అనంతరం లాకారం సందర్శనార్థం వచ్చిన పెద్దలు, చిన్నారుల అభ్యర్థన మేరకు సెల్ఫీ లకు ఫోజులు ఇచ్చారు..