ప్రపంచ పెట్టుబడుల సాధకుడు కేటీఆర్
★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
★ రాష్ట్రానికి ప్రపంచ అతిపెద్ద త్రిచక్ర
విద్యుత్తు వాహనాల తయారీ సంస్థ
(ఖమ్మం -విజయం న్యూస్):-
తెలంగాణకు మంత్రి కేటీఆర్ ప్రపంచంలోని పెట్టుబడుల సాధనకి పడుతున్న తపన రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. కేటీఆర్ చొరవతో అమెరికాకు చెందిన ప్రసిద్ధ విద్యుత్ వాహనాల సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్ రాష్ట్రంలో రూ.1,144 కోట్లతో భారీ త్రిచక్ర వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తూ సంస్థ తీసుకున్న నిర్ణయంపై పట్ల మంత్రి అజయ్ హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవలే అమెరికాకు చెందిన ఈవీ సంస్థ ఫిస్కర్ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందం మేరకు హైదరాబాద్‌లో రెండో ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించడం శుభపరిణామమని మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఏడాదికి 2.4 లక్షల విద్యుత్ వాహనాల తయారీ సామర్థ్యంతో సంగారెడ్డి జిల్లా వెల్మల పారిశ్రామికవాడలో 13.5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి కల్పించనుందని మంత్రి వివరించారు.
also read :-నాకు నా పిల్లలకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించండి
రాష్ట్రంలో మౌలిక వసతులు అత్యుత్తమంగా ఉన్నందున రాష్ట్రాన్ని విద్యుత్ వాహనాల ప్రపంచస్థాయి కేంద్రంగా(హబ్) తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలనే ఉద్దేశంతో ఈవీ పాలసీని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్ తో ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కంపెనీల ఏర్పాటు చేయాలని చూస్తున్నారంటే దాని వెనకాల మంత్రి కేటీఆర్ కఠోర శ్రమ, కృషి ఎంతో ఉన్నదని అన్నారు. ప్రపంచ మేటి పరిశ్రమలు తెలంగాణకు రావడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో లక్షా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి స్పష్టంచేశారు. మరో 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.