Telugu News

బాధిత కుటుంబాన్నీ ఓదార్చిన కేటీఆర్

బాధిత కుటుంబానికి భరోసాగా నిలిచిన కేటీఆర్

0

బాధిత కుటుంబాన్నీ ఓదార్చిన కేటీఆర్
* *బాధిత కుటుంబానికి భరోసాగా నిలిచిన కేటీఆర్
(తిమ్మాపూర్-విజయం న్యూస్);-
కరీంనగర్ జిల్లాలో పలు ప్రారంభోత్సవ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు మండల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రేణికుంట టోల్గేటు వద్ద పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగాతిమ్మాపూర్ మండల కేంద్రంలో ఇటీవలే మరణించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కుని అందించి

also read;-బిజెపి శ్రేణుల నిర్బంధ అరెస్టులు అప్రజాస్వామికం

వారిని ఓదార్చిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , రాష్ట్ర ఐటి ,పురపాలకశాఖ మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అంద జేసారు.ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు ,తెలంగాణ రాష్ట్ర ఇఫ్ఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ,రాష్ట్ర నాయకులు ఉలేoగుల ఏకానదం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ నాయిని వెంకట్ రెడ్డి,మాతంగి లక్ష్మణ్ , టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.\