Telugu News

ఘనంగా కూసుమంచి ఎంపీపీ పుట్టిన రోజు వేడుకలు

== హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్, సోసైటీ చైర్మన్

0

ఘనంగా కూసుమంచి ఎంపీపీ పుట్టిన రోజు వేడుకలు

== హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్, సోసైటీ చైర్మన్

కూసుమంచి,జూన్ 6(విజయంన్యూస్):

కూసుమంచి మండల ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ పుట్టిన రోజు వేడుకలను సోమవారం కూసుమంచి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల చైర్మన్లు హాజరై పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి కూసుమంచి మండల కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో యువకులు డ్యాన్స్ లు చేశారు. అనంతరం ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ పుట్టిన రోజు కేక్ ను కట్ చేయగా నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, కల్లూరిగూడెం సోసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జర్పుల శ్రీనివాస్ నాయక్, సర్పంచులు కేక్ ను ఎంపీపీకి తినిపించి శుభాకాంక్షులు తెలిపారు. గజమాలతో ఎంపీపీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా చైర్మన్లు మాట్లాడుతూ ప్రజల సేవచేసే మంచి మనసునున్న మహారాజు ఎంపీపీ బానోతు శ్రీనివాస్ అని, ఆయన నిండునూరేళ్ల పాటు సుఖసంతోషాలు, ఆయురార్యోగాలతో ఉండే విధంగా ఆ దేవదేవుళ్లు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల  పార్టీ మాజీ అధ్యక్షుడు చాట్ల పరుశురామ్, సర్పంచులు మందడి పద్మారెడ్డి, భర్మావత్ రవి, బానోతు నాగేశ్వరరావు, జర్పుల అనుసూర్య, బానోతు సరస్వతి, ధరవాత్ వెంకట్ నాయక్, బానోతు రవి, దరావత్ రవి నాయక్, పూల్ సింగ్ పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తదితరులు హాజరైయ్యారు.

ALLSO READ- గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన తెలంగాణ సర్కార్ : భట్టి