Telugu News

కూసుమంచి పీహెచ్ సీ అద్భుతంగా ఉంది

చాలా నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు

0

కూసుమంచి పీహెచ్ సీ అద్భుతంగా ఉంది

== చాలా నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు

== కూసుమంచి పీహెచ్ సీని పరిశీలించిన నాణ్యతా ప్రమాణాల అంచనాల కమిటీ

(కూసుమంచి-విజయం న్యూస్);- 
కూసుమంచి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయి అధికారుల ప్రసంశసలను అందుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చాలా అద్భతంగా ఉందని, చాలా నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. అలాగే కార్పోరేట్ ఆసుపత్రి ఉన్నట్లుగానే అందంగా తీర్చిదిద్దారని, అందుకు వైద్యులను, సిబ్బందిని అభినందిస్తున్నామని తెలిపారు.

also read;-ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి: ముగ్గురికి తీవ్ర గాయాలు

గురువారం కూసుమంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల అంచనాల కమిటీ (ఎన్క్యూస్ కమిటీ) బృందం పరిశీలించింది. డాక్టర్ ధర్మేష లాల్, డాక్టర్ విక్రాంత్ నగారా నేతృత్వం లోని బృందం సభ్యులు 6 డిపార్ట్మెంట్లలోని నాణ్యతా ప్రమాణాలపై సర్వే చేసి నివేదిక రూపొందించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరిగారు. ఆసుపత్రి ముందు తయారు చేసిన అందమైన పార్క్ ను వారు చూసి ఆశ్ఛర్యపోయారు. ఇది ప్రభుత్వాసుపత్రేనా..? అంటూ నర్సులను అడిగారు.

చాలా బాగా చూసుకుంటున్నారని అన్నారు. అలాగే అక్కడ రోగులతో మాట్లాడారు.. రోగులు వారికి అందుతున్న వైద్యసేవల గురించి చెబుతూ వైద్యుల సేవలను కొనియాడారు. దీంతో పరిశీలకులు ఆశ్ఛర్యపోయారు. అనంతరం ఆసుపత్రిలో ప్రతి రూమ్ ను పరిశీలించారు. మందుల దుకాణంను పరిశీలించారు. చాలా నాణ్యత ప్రమాణాలతో ఆసుపత్రిని నడిపిస్తున్నారని కొనియాడారు. మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఇవాంజీలిన్, సిబ్బందిని అభినందించారు. ఆయా అంశాల్లో ప్రగతి నివేదిక ఆధారంగా ధృవపత్రాన్ని అందచేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఇవాంజీలిన్, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సిబ్బంది హాజరైయ్యారు.