రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకం: మంత్రి తలసాని
== మత్స్యకారులకు ప్రోత్సాహకాలతో పెరిగిన ఉపాధి
(అసెంబ్లీ-విజయంన్యూస్):-
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చేపలను, రొయ్యలను భారీ ఎత్తున పెంచుతున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకానికి ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు.
also read :-ఆగస్ట్ 12న ఏజెంట్‌గా వస్తోన్న అఖిల్
చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమైక్య ఆంధ్రలో మత్స్యకారులను పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను మరిచిపోయాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అన్ని కులాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. దీంతో ఇప్పుడు చేపల ఎగుమతిలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు. చేపలతో పాటు రొయ్యల పెంపకాన్ని కూడా చేపట్టామన్నారు.
also read :-మంత్రివర్గ మార్పులపై జిల్లాలో జోరుగా చర్చ
మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 150 మొబైల్ వెహికల్స్‌ను మత్స్యకారులకు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అంతకు ముందు సండ్ర వెంకట వీరయ్య, రసమయిబాలకిషన్ తదితరులు మాట్లాడారు. చేపల పెంపకం వల్ల వస్తున్న ప్రోత్సాహాలను ప్రవంసించారు. శనివారం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి ప్రశ్నలు అడుగుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. మైక్ కట్ చేసి ఎమ్మెల్యే గొంగడి సునీతకు మైక్ ఇచ్చారు.
ఇంతలో దీనిపై రసమయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభలో మాట్లాడదాం అంటే మాట్లాడే అవకాశాలు రావు.. కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలే అడగవద్దు అన్నప్పుడు తమకు ప్రశ్నలు ఎందుకు ఇవ్వడం అంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు. తాను ప్రశ్నలే అడుగుతున్నానని వాదించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే తమజిల్లాకు మేలు చేసిన మంత్రిని ప్రశంసించడం విధి అన్నారు. ఆయన వ్యాఖ్యలపై పద్మారావు స్పందిస్తూ.. తొందరగా ప్రశ్నలే అడగండి.. ప్రసంగాలు వద్దూ అంటూ వ్యాఖ్యలు చేశారు. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ రసమయి తన కుర్చీలో సైలెంట్‌గా కూర్చుండిపోయారు.
please subscribe this chanel smiling chaithu