కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం..
*కార్మిక హక్కులు కాలరాస్తున్న కేంద్రం..సీపీఐ నేతలు పోటు, జా.. * సామిల్ వర్కర్స్ యూనియన్ అద్వర్యంలో...
కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం..
*కార్మిక హక్కులు కాలరాస్తున్న కేంద్రం..సీపీఐ నేతలు పోటు, జా..
* సామిల్ వర్కర్స్ యూనియన్ అద్వర్యంలో…
ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఖమ్మం నగరంలో వాడవాడలా కార్మికుల పతాకం రెపరెపలాడిoది…136 వ మేడే వేడుకలను కార్మికసోదరులు ఘనంగాజరుపుకున్నారు…
ఖమ్మం నగరంలోని పారిశ్రామిక వాడ ప్రశాంతి నగర్ లో సామిల్ వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో సామిల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి షేక్ ఇబ్రహీం అధ్యక్షతన సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కార్మిక జెండాను ఆవిష్కరించారు…
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర కార్యదర్శి ఎస్కే జానీమియా మాట్లాడారు… కార్మికుల హక్కుల సాధన కోసం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల త్యాగాలతో 8 గంటల పని దినం అమలులోకి రావడంతో మేడే ను జరుపుకుంటున్నామని వారు తెలిపారు..
also read :-ప్రైవేట్ మాటున పెరుగుతున్న శ్రమదోపిడి…
also read :-ఘనంగా ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆధ్వర్యంలో కార్మికులకు యూనిఫామ్ వితరణ
ఈ కార్యక్రమంలో జాఫర్, కృష్ణ, రహీమ్, సైదులు, బాబా, ఆశీర్వాదం, హుస్సేన్ ,నజీర్,ఇస్మాయిల్, వెంకటాచారి, యూసుఫ్, సైదులు, హబీబ్ సైదులు,రమేష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు..