కష్టపడి వచ్చిన విజయంతోనే జీవితాలు రంగులమయం : నామా
హోలీ శుభాకాంక్షలు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు
కష్టపడి వచ్చిన విజయంతోనే జీవితాలు రంగులమయం : నామా
హోలీ శుభాకాంక్షలు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు
(ఖమ్మం-విజయంన్యూస్)
ప్రతి మనిషి జీవితంలో కష్టపడితేనే విజయం తీరాలను చేరుకుంటారని… అప్పుడు వారి జీవితం రంగులమయం అవుతుందని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు పేర్కొన్నారు. హోలీ పండగను ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషల ప్రజానీకం సంబరంగా జరుపుకునే పండుగ ఇదేనని చెప్పారు.
also read;-అభివృద్ధి,ఆరోగ్య తెలంగాణే కేసీఅర్ లక్ష్యం : మంత్రి పువ్వాడ
కరోనా ఉధృత్తి నుంచి రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కాపాడారని ఆయన కొనియాడారు. దాంతో ఎంతోమంది రాష్ట్ర ప్రజానీకం జీవితాల్లో వెలుగులు, రంగులు నిండాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. చిన్న పిల్లలు హోలీ ఆడేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అలానే రసాయనాలతో కూడిన హానికరమైన రంగులతో కాకుండా సాధారణమైన రంగులు, నీటి తోనే హోలీ పండుగ నిర్వహించుకోవాలని ఆయన సూచించారు