మద్యం దుకాణాలకు రిజర్వేషన్లా.. ఏ చట్టంలో ఉంది?
రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో మాత్రమే వర్తిస్తాయి
దుకాణాల కేటాయింపులపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ
మద్యంవ్యాపారంలో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాం గంలోగానీ, చట్టంలోగానీ ఎక్కడుందో చెప్పాలని హై కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎస్సీల జనాభా 15.45 శాతం, ఎస్టీల జనాభా 9.08 శాతం ఉందని, కానీ మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేష న్లు కల్పించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు.
దీని పై ధర్మాసనం స్పందిస్తూ… మద్యం వ్యాపారం నిర్వహణకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిబంధనలు ఎక్కడున్నా యో చూపించాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. రా జ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో మా త్రమే వర్తిస్తాయని వ్యాఖ్యానించింది. ఆయా వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదా ర స్వభావంతో మద్యం దుకాణాల కేటాయింపుల్లో ప్ర స్తుతం రిజర్వేషన్లు కల్పించి ఉండొచ్చని, కానీ వాటిని కూడా తీసేయాల్సి వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మద్యం దుకాణాల కేటాయింపుపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది..
also read :- కొండగట్టు బాధితులకు కేంద్రం సాయం.