Telugu News

‘పాలేరు’ రేసులో స్థానిక నేత..?

గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఆ నాయకుడు

0

‘పాలేరు’ రేసులో స్థానిక నేత..?
== గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఆ నాయకుడు
== యువతను అకట్టుకుంటూ గ్రౌండ్ లేవల్ పనులు
== సందడిలో సడేమియా గా దూరేందుకు ప్రయత్నం
== నియోజకవర్గ వ్యాప్తంగా అసక్తిగా చర్చించుకుంటున్న నేతలు, ప్రజలు
(కూసుమంచి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాలోనే అత్యంత కీలక నియోజకవర్గం ‘పాలేరు నియోజకవర్గం’. జనరల్ స్థానంతో ఉన్న ఈ నియోజకవర్గంలో ఇరు పార్టీల నుంచి పోటీ చేసే ఆశావాహులు అధికంగానే ఉంటారు. 2009 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్వీభజన చేసిన సమయంలో జనరల్ రిజర్వషన్ ఏర్పడిన పాలేరు నియోజకవర్గం నేటికి అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా మారింది. పాలేరు నియోజకవర్గంలో ఎక్కువ మంది పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరుపున చాలా మంది నాయకులు సీటును ఆశించారు.

also read;-ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్

సుమారు 20 మంది పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కాగా ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సుల మేరకు రామిరెడ్డి వెంకట్ రెడ్డికి టిక్కెట్ సాధించి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి ఎక్కువగానే నాయకులు టిక్కెట్ ను ఆశీంచినప్పటికి రెండవ సారి కూడా రాంరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ అదిష్టానం అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి బరిలో నిలిచి గెలిచారు. అధికారం లేకపోయినప్పటికి విజయం సాధించిన ఆయన 2016లో పదవిలో ఉండగానే చనిపోయారు.

also read;-సీఎం కేసిఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనం

దీంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతర జరిగిన ఉప ఎన్నికల్లో పాలేరు నుంచి అటు అధికార పార్టీలో, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో కూడా పెద్ద ఎత్తున్న పోటీ దారులు ఆశపడ్డారు. ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రిగాపనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు, తాతామధుసూధన్, రామసహాయం నరేష్ రెడ్డి, బాలసాని లక్ష్మినారాయణ తదితరులు పోటీ చేసేందుకు టిక్కెట్ ను ఆశించారు. అయినప్పటికి తుమ్మల నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ కేటాయించగా, కాంగ్రెస్ మాత్రం రాంరెడ్డి సతిమణిని బరిలో నిలిపారు. అయినప్పటికి పోటీ మాత్రం వన్ సైడ్ వార్ గా నడవలేదు. ఇక అనంతరం 2019 జనరల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దగా పోటీ అనిపించకపోయినప్పటికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం మస్తు మంది ఆశావహులు పోటీ పడ్డారు..

చివరి నిమిషంలో కందాళ ఉపేందర్ రెడ్డి స్థానికుడి టిక్కెట్ దక్కించుకుని బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయగా, కందాళ ఉపేందర్ రెడ్డి కన్నులోట్టబోయినట్లు గెలిచారు. అందుకు బలమైన కారణాలు ఉన్నాయ. హస్తం గుర్తు ఒక కారణమైతే, కష్టపడి పనిచేసిన నాయకులు, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు మద్దతు తెలిపడం వల్ల ఆయన గెలిచారు. అయితే రాజకీయ పెనుమార్పుల్లో భాగంగా కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు వారిద్దరు శత్రువులుగానే భావించుకుంటున్నరు.
== రాబోయే ఎన్నికలకు వ్యూహం..?
తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాడివేడి షూరు అయ్యింది. అందులో భాగంగానే ఆయా పార్టీల నుంచి నాయకులు టిక్కెట్లు దక్కంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఉండగా, ఆయనపై పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు టీఆర్ఎస్ టిక్కెట్ నాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే తెరవెనక ప్రస్తుతం ఎమ్మెల్సీ తాతామధూసూధన్, రాష్ట్ర పోలీస్ బాస్ గా పనిచేస్తున్న అధికారి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మరో వ్యక్తి కూడా తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది.. ఆ విధం ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.
== రేసులో ఉన్నట్లేనా..?
పాలేరు నియోజవర్గంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా జిల్లా, మండల స్థాయిలోని కీలక పదవులకు ప్రజాప్రతినిధిగా మెలుగుతున్న స్థానిక నేత పాలేరు టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.. తెరముందు నాకేం తెలవ్వదన్నట్లుగానే ఉంటున్నప్పటికి తెరవెనక మాత్రం తనుపని తాను చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.. అక్కడక్కడ తన వర్గీయులుగా పనిచేస్తున్న యువ నేతలకు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. అదిష్టానం వద్ద కీలకంగా పనిచేస్తున్న ఓ నాయకుడి అండతో ఆయన పాలేరు సీటుపై కన్నేసినట్లు సమాచారం.. కందాళ, తుమ్మల మధ్య బలమైన వర్గపోరు కొనసాగుతుండగా, సందులో సడేమీయా అన్నట్లుగా తనకు అవకాశం రావోచ్చని పలువురితో చెప్పుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా కందాళ ఉపేందర్ రెడ్డితో కలిసి తిరుగుతూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా తన బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

also read;-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క@మీడియా పాయింట్

ఇప్పటికే తనకు అనుకూలంగా ఉండే వారికి పార్టీ పదవులు ఇప్పించుకుంటున్న ఆయన అవసరమైతే బలనిరూపణ చేయాల్సి వస్తే వీరందర్ని వాడుకోవాలని.. వారి బలంతో ముందుకు సాగాలని యోచన చేస్తున్నట్లు సమాచారం. అందుకే కచ్చితంగా వారందరి ఉపయోగపడే అవకాశం ఉందని భావించిన ఆ నాయకుడు ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయడం, పుట్టిన రోజు వేడుకలు, పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించడం, కష్టం వచ్చిన వారిని అదుకునేందుకు ప్రయత్నించడం, క్రీడాల పేరుతో బహుమతుల కోసం లక్షల్లో యువతకు డబ్బులు ఇవ్వడం లాంటి కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పాలేరు టిక్కెట్ పై అధికార పార్టీలో కొంత మంది ఆశావాహులు ఎక్కువ చూపుతున్నట్లు సమాచారం. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..? అదిష్టానం ఎవరికి టిక్కెట్ ఇస్తుందో చూడాల్సిందే..?