Telugu News

మంత్రివర్గ మార్పులపై జిల్లాలో జోరుగా చర్చ

ఉన్న ముగ్గురికీ ఉద్వాసన తప్పదేమో అన్న ఉత్కంఠ

0

మంత్రివర్గ మార్పులపై జిల్లాలో జోరుగా చర్చ
== ఉన్న ముగ్గురికీ ఉద్వాసన తప్పదేమో అన్న ఉత్కంఠ
== కొత్తగా ఎవరు వస్తారో అని ప్రజల్లో టెన్షన్‌
(కాకినాడ-విజయంన్యూస్)
మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని సిఎం జగన్‌ సంకేతాలు ఇవ్వడంతో మార్పులు,చేర్పుల్లో ఎవరుంటారు.. ఎవరు ఊడతారనే దానిపై జిల్లాలో ఇప్పుడు చర్చ సాగుతోంది. అసలే కొత్త జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో మూడు జిల్లాలకు ముగ్గురు మంత్రులు ఉంటారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంత్రులు విశ్వరూప్‌, వేణు ఇద్దరూ కోనసీమ జిల్లా పరిధిలోకి వస్తుండడంతో వీరిద్దరిలో ఒకరిపై వేటు ఖాయం. అటు మంత్రి కన్నబాబును తప్పిస్తే ఆ స్థానంలో ఎవరు వస్తారన్నది కూడా చర్చగా మారింది.

also read :-ఆగస్ట్‌ 12న ఏజెంట్‌గా వస్తోన్న అఖిల్‌

మంత్రులుగా తొలగించిన వారు జిల్లాలకు అధ్యక్షులు అవుతారని కూడా సిఎం చెప్పడంతో పార్టీ పరంగా వారికి బాధ్యతలు పెరిగే ఛాన్స్‌ ఉందది. మరోపక్క ఇప్పుడున్న ముగ్గురు మంత్రుల్లో అందరినీ తొలగిస్తారా లేక..ఒకరిద్దరి మాత్రమే తొలగిస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుత మంత్రి తానేటి వనిత ఈ జిల్లాలో కలుస్తున్నా ఆమె పదవికీ గండం ఉంది. గోపాలపురం నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో సీఎం అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ విస్తరణ ఖాయం అని సీఎం జగన్‌ క్యాబినేట్‌ సమావేశంలో స్పష్టత ఇచ్చారు.

also read :-ఓవర్సీస్‌లో మంచి టాక్‌ సొంతం చేసుకున్న రాధేశ్యామ్‌

మంత్రి పదవి కోసం చాలా మంది ఆశావహులు ఉన్నారు. అయితే మార్పులు, చేర్పుల్లో ఎవరు ఛాన్స్‌ కొడతారా అన్నది ఇప్పుడు ప్రజల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడున్న ముగ్గురు మం త్రులు కన్నబాబు, విశ్వరూప్‌, వేణుల్లో ఎవరుంటారు? ఎవరు ఊడుతారు? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఎవరికివారు తాము సీఎంకు దగ్గరయ్యామని, పదవికి ఢోకా లేదని లెక్కలు వేసుకున్నారు. అటు ఆశావహులు సైతం ఇప్పుడున్న వారి స్థానాల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అనుహ్యంగా కొత్త జిల్లాలు తెరపైకి రావడంతో మంత్రుల లెక్కలు, ఆశావహుల ప్రయత్నాల్లో తేడాలొచ్చాయి. కొత్త జిల్లాలు రాజమహేంద్రవరం, కోనసీమతోపాటు కాకినాడ జిల్లా ఈ మూడిరటికి ముగ్గురు మంత్రులు ఉంటారని అంటున్నారు.

also read :-వందకోట్ల క్లబ్‌లో చేరిన గంగూబాయి

కోనసీమలో ఎస్సీ సామాజికవర్గ అధి కంగా ఉన్నందున విశ్వరూప్‌ను తప్పించరని ఆయన అనుచరులు లెక్కలు వేస్తున్నారు. మంత్రి విశ్వరూప్‌ను తప్పిస్తే తనకు అవకాశం ఉంటుందని అటు త్రిమూర్తులు, ఇటు ముమ్ముడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కూడా ఆశ పడుతున్నారు. అలాకాకుండా అదే సామాజికవర్గం అయితే ఎమ్మెల్యే కొండేటి, ఎమ్మెల్సీ పండుల తమకు ఛాన్స్‌ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే వనిత మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నా ఆమెను తప్పించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. మరో మంత్రి కన్నబాబును తప్పించి పార్టీ బాధ్యతలు కట్టబెడతారని చర్చసాగుతోంది. మరోవైపు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా ఎవరు ఉంటారు..ఎవరు పోతారన్నది చర్చగా మారింది.

 

please subscribe this chanel smiling chaithu