కౌలురైతుల ఆత్మహత్యలపై అబద్దాలా?
** వాటిని దాచాల్సిన అవసరం ఏముంది
** వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం
**మీడియా సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్
(రాజమండ్రి-విజయంన్యూస్);-
కౌలురైతులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఏ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదని, కౌలుదారు చట్టంలో తప్పిదాలు జరిగాయన్నారు. రాజమండ్రిలో నాదెండ్ల మనోహర్ గురువారం విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాకు కులాలు అంటగట్టడం దుర్మార్గమని, కౌలు రైతులు అల్లాడిపోతున్నారని వెల్లడిరచారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు జీవో ప్రకారం 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
also read :-విద్యుత్ ఛార్జీల పెంపుపై మండిపడ్డ టిడిపి
రైతు భరోసా పథకం క్రింద 2 లక్షల రూపాయలు అందిస్తామని వైసీపీ నేతలు ఆత్మహత్యలు కాదని మార్చేస్తున్నారని అన్నారు. జీవో 102 అమలుకు ఉభయగోదావరి జిల్లాలు వేదికగా జనసేన ఉద్యమం చేస్తుందన్నారు. ప్రభుత్వం నుండి నెల రోజుల్లో స్పందన రాకపోతే జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కలుసుకుని బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. రైతు స్వరాజ్య వేదిక అందించిన రిపోర్ట్ మేరకు కౌలు రైతుల కష్టాలపై జనసేన ఆందోళన చేపడుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా ఉద్యమం చేస్తామన్నారు.ఇదిలావుంటే రాష్ట్రంలో గతేడాది పంట నష్టపోయిన రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడితే ఆ విషయాలను బయటకు రానీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మనోహర్ ఆరోపించారు.
also read:-పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీలపై కాంగ్రెస్ ఆందోళన
పంట నష్టపోయిన రైతు ఆత్మహత్యకు పాల్పడితే తక్షణమే జీవోనెం.43 ప్రకారం ఆ కుటుంబానికి రూ.7లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన దాఖాలు లేవని అన్నారు. 9జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వద్ద ఉందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. బాధిత రైతుకుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లాస్థాయిలో తమ పార్టీ
కలెక్టర్‌లను కలిసి వినతిపత్రాలు అందిస్తుందని, నెలరోజుల వ్యవధిలో నష్టపరిహారం చెల్లించకుంటే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నేరుగా రైతులు తరపున పోరాటం చేస్తారని చెప్పారు.