Telugu News

ఉమ్మడి మండలo లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన…..

భారీ కాన్వాయ్ తో స్వాగతం పలికిన నాయకులు....

0

ఉమ్మడి మండలo లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన…..

—-భారీ కాన్వాయ్ తో స్వాగతం పలికిన నాయకులు….

—-తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్…..

—-దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాజకీయాలు…..

—-కార్యకర్తలకు అండగా ఉంటా… ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడుతా……

(చండ్రుగొండ -విజయం న్యూస్ ): –

మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన అశేష జనవాహిని మధ్య కొనసాగింది… మండల సరిహద్దు అయిన మంగయ్య బంజరు గ్రామం వద్దకు భారీ కాన్వాయ్ తో, మోటర్ సైకిల్ ర్యాలీ, ఘనంగా స్వాగతం పలికారు… అదేవిధంగా పి ఎస్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ని సన్మానించారు..

also read;-వెంకన్నను పరామర్శించిన మద్ది శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్….
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని అభివృద్ధిలో కొత్త పంధా అవలంబిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన ముద్ర వేస్తున్నారని, అదే విధంగా దేశంలో ఏ రాష్ట్రం తీసుకొని నిర్ణయాలు తీసుకుని, బంగారు తెలంగాణ స్థాపనకు అశేషమైన కృషి చేస్తున్నారని
ఖమ్మం పార్లమెంటు మాజీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి, ఇటీవల చనిపోయిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. పోకలగూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ని పరామర్శించి అనారోగ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకొని అండగా ఉంటానని భరోసా కల్పించాడు…పదవులు ఉన్నా లేకున్నా నేను మీకు అండగా ఉంటా , పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ కార్యకర్తల ల ప్రేమే నాకు ఎప్పటికీ శాశ్వతం, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, నేను మీ అందరికి ఒక పెద్ద అన్నయ్యలా ఉంటానని నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కష్టాల్లో, సుఖాలలో ,ఎప్పుడూ అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా కల్పించారు..

also read;-ధాన్యం కొనడం చేత కాకుంటే దిగిపోండి
అయ్యన్న పాలెం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ తక్కువ కాలంలో పూర్తిచేసి తను కలల గన్న సాగునీటి సరఫరా ను స్వరాష్ట్రంలో చూపిన నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.. రైతులకు మంచి చేసే కెసిఆర్ ను ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు అన్నారు.. రైతులకు అన్ని వేల అండగా ఉండే పార్టీ టిఆర్ఎస్ ఒక్కటేనన్నారు…

పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తానని, పోటీ మాత్రం తప్పదని అన్నారు… ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, అన్నపురెడ్డిపల్లి,చంద్రుగొండ మండలాల ఎంపీపీలు సున్నం లలిత, భానోత్ పార్వతి, గాను పాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మువ్వ విజయ్ బాబు, తుళ్లూరు బ్రహ్మయ్య, మాల బొజ్జ నాయక్, బోయినపల్లి సుధాకర్ రావు, సారేపల్లి శేఖర్, నరకుల్లా సత్యనారాయణ , బానోత్ రాన్య, పూసం వెంకటేశ్వర్లు, సత్తి నాగేశ్వరరావు, ఇస్లావత్ శంకర్, గుగులోతు రాములు, గాదె లింగయ్య, పర్సా వెంకటేశ్వరావు, కొత్తూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు