Telugu News

టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ వద్ద మహాధర్నా

= ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా

0

టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ వద్ద మహాధర్నా

== ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా

== జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్.

(ఖమ్మం-విజయం న్యూస్);-
ఈ నెల 7న కేంద్రం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ లో నిర్వహించు మహా ధర్నా కార్యక్రమానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు భారీ ఎత్తున తరలిరావాలని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతామదుసూధన్ హాజరువుతారని తెలిపారు. బుధవారం ఖమ్మం నగరంలోని రాష్ట్ర మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో,సుడా డైరెక్టర్లతో, పార్టీ ముఖ్య నాయకులతో,డివిజన్ అధ్యక్ష కార్యదర్శులతో ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది.

also read;-రైతులు పండించిన వడ్లన్నీ కేసీఆర్ కొనాల్సిందే

ఈ సమావేశంలో సుడా చైర్మన్ మాట్లాడుతూ:- కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట కొనుగోలు బాధ్యత పూర్తిగా వహించాలని అన్నారు. కేంద్రం యాసంగి వడ్లు కొనే దాకా తెరాస ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని ఖమ్మం సుడా చైర్మన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలో సాగు పెరిగిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్ సిఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం అమలు చేయడం సహేతుకం కాదన్నారు. రాష్ట్రంలో భాజపా ఎంపీలు దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు.

also read;-చైనాలో కరోనా మళ్ళీ పంజా!
కేంద్రం నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గుజరాత్ మహారాష్ట్ర పంజాబ్ పై ఉన్న ప్రేమను తెలంగాణ పై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిరసనగా ఈ నెల 7న జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టనున్నట్టు వెల్లడించారు. మహా ధర్నా ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు. నేడు జరిగే మహా ధర్నా కార్యక్రమానికి కార్పొరేటర్లు,సుడా డైరక్టర్లు,నగర కమిటీ సభ్యులు,అన్ని డివిజన్ లా అధ్యక్ష కార్యదర్శులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,పార్టీ శ్రేణులు,రైతులు,టిఆర్ఎస్కెవి కార్మికుల విభాగం,టిఆర్ఎస్కెవి ఆటో యూనియన్ విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని,మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బచ్చు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

also read;-కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ధరలకు నిరసన

కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ప్రత్యక్ష పరోక్ష ఆందోళన వివిధ రూపాలలోరూపాంతరం చెందుతాయని అన్నరు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఆర్.జె.సి.కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, మాజీ నగర అధ్యక్షులు కార్పొరేటర్ కమర్తపు మురళి, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఖమర్, మంత్రి పి.ఏ చిరుమామిళ్ల రవికిరణ్, కార్పొరేటర్లు,సుడా డైరెక్టర్లు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కృష్ణ చైతన్య, మైనారిటీ అధ్యక్షులు తాజ్, అన్ని డివిజన్ లా అధ్యక్ష కార్యదర్శులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు,టీఏటీయు ఆటో యూనియన్ కృష్ణ సభ్యులు, నున్న మాధవరావు, కెసిఆర్ టవర్స్ సొసైటీ సభ్యులు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.