Telugu News

టీఆర్ఎస్ ప్లీన‌రీని విజయవంతం చేయండి

ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలోని ప్రతి గల్లీలో పార్టీ జెండా రెపరెపలాడాలి

0

టీఆర్ఎస్ ప్లీన‌రీని విజయవంతం చేయండి

–ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలోని ప్రతి గల్లీలో పార్టీ జెండా రెపరెపలాడాలి

—-టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పిలుపు

(ఖమ్మం విజయం న్యూస్ ):-
తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ 21వ వార్షికోత్సవం సంద‌ర్భంగా ఈ నెల 27న హైదరాబాద్, మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ప్లీనరీ స‌మావేశాన్ని ఘ‌న విజ‌యం చేయాల‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా న‌లుమూల‌న గులాబీమయం చేయాల‌ని టీఆర్ఎస్ శ్రేణుల‌కు సూచించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు పండుగలా నిర్వహించాలని ఆయ‌న చెప్పారు. మంగ‌ళ‌వారం ఈ మేర‌కు ఎంపీ నామ నాగేశ్వ‌రరావు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

also read :-దళిత బంధు అమలు. చారిత్రాత్మక నిర్ణయం

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడి 21 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా చేపట్టాలన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు గ్రామంలో గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అంత కలిసి జెండాను పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని స్ప‌ష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు సంఘటితంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పారు. ప్రతి గల్లీలో పార్టీ గులాబీ జెండా రెపరెపలాడాలని, అందుకు ప్రతి డివిజన్‌, వార్డులో పార్టీ శ్రేణులు అందరిని కలుపుకొని జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.